Agent: పాన్ ఇండియా సినిమాగా అఖిల్ ‘ఏజెంట్‌’.. టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్.. ఎప్పుడంటే?

భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఏజెంట్‌గా టైటిల్ రోల్ పోషిస్తోన్న అఖిల్.. ఎంతో స్టైలీష్‌గా కనిపించనున్నాడు.

Agent: పాన్ ఇండియా సినిమాగా అఖిల్ ‘ఏజెంట్‌’.. టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్.. ఎప్పుడంటే?
Agnet Akhil

Akhil Akkineni’s Agent: యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాతో పాన్ ఇండియా అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఏజెంట్ టీజర్ జులై 15న విడుదలవుతుంది. ఈ మేరకు ఓ వీడియో ద్వారా మేకర్స్ నేడు ప్రకటించారు.

భారీ బడ్జెట్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఏజెంట్‌గా టైటిల్ రోల్ పోషిస్తోన్న అఖిల్.. ఎంతో స్టైలీష్‌గా కనిపించనున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో అఖిల్ ప్రేమికురాలిగా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ సినిమాతోనే ఈ బ్యూటీ అరంగేట్రం చేయనుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.

సెన్సేషనల్ కంపోజర్ హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్‌గా పనిచేశారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి

దర్శకుడు: సురేందర్ రెడ్డి

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

సహ నిర్మాతలు: అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి

బ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా

కథ: వక్కంతం వంశీ

సంగీత దర్శకుడు: హిప్ హాప్ తమిజా

DOP: రసూల్ ఎల్లోర్

ఎడిటర్: నవీన్ నూలి

ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా

PRO: వంశీ-శేఖర్