Amarnath cloudburst: పదికి చేరిన అమర్‌నాథ్‌ మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని

ఈ ప్రాంతంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ)తోపాటు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలుసహా మొత్తం ఆరు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. The post Amarnath cloudburst: పదికి చేరిన అమర్‌నాథ్‌ మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని appeared first on 10TV.

Amarnath cloudburst: పదికి చేరిన అమర్‌నాథ్‌ మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని

Amarnath Cloudburst

Amarnath cloudburst: అమర్‌నాథ్‌లో ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య పదికి చేరింది. శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అమర్‌నాథ్‌ గుహ ప్రాంతంలో ఒక్కసారిగా కుంభవృష్టి కురిసింది. దీంతో ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద ముంచెత్తింది. ఈ వరద ప్రభావంతో పది మంది మరణించినట్లు ప్రాథమిక సమాచారం. మరికొంత మంది గాయాలపాలయ్యారు.

Driving Test Fraud: డ్రైవింగ్ టెస్ట్ మోసం.. భారత సంతతి మహిళకు బ్రిటన్‌లో జైలు శిక్ష

ఈ ప్రాంతంలో చిక్కుకున్న బాధితుల్ని రక్షించేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల (ఐటీబీపీ)తోపాటు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలుసహా మొత్తం ఆరు బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరదల కారణంగా అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా మెరుగైన తర్వాత తిరిగి యాత్ర ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. అమర్‌నాథ్‌ ప్రాంతంలో కుంభవృష్టిపై ప్రధాని మోదీ స్పందించారు. యాత్రికుల్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

Jharkhand: స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం

ఈ అంశంపై జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడినట్లు వెల్లడించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ అంశంపై స్పందించారు. అక్కడ చిక్కుకున్న యాత్రికుల్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. భక్తుల్ని కాపాడటమే తమ ప్రాధాన్యమని చెప్పారు. ఈ వరదల కారణంగా అమర్‌నాథ్‌ వద్ద ఏర్పాటు చేసిన 25 టెంట్ల వరకు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.

The post Amarnath cloudburst: పదికి చేరిన అమర్‌నాథ్‌ మృతుల సంఖ్య.. స్పందించిన ప్రధాని appeared first on 10TV.