Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!

ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సర్వీసుల్లో ఒకటి అమెజాన్ ప్రైమ్. అమెజాన్ ప్రైమ్ యూజర్లను రెండే రెండు క్లికులతో అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. The post Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..! appeared first on 10TV.

Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!

Amazon Prime Users Can Now Cancel Their Subscription In Just Two Clicks

Amazon Prime : ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సర్వీసుల్లో ఒకటి అమెజాన్ ప్రైమ్ (Amazon Prime). అమెజాన్ ప్రైమ్ యూజర్లను రెండే రెండు క్లికులతో అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. యూజర్లు తమ సబ్‌స్క్రిప్షన్‌లను క్యాన్సిల్ చేసుకునే విధానాన్ని కంపెనీ మరింత సులభతరం చేస్తోంది. కొన్నాళ్లుగా ప్రైమ్ యూజర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు యూరోపియన్ కమిషన్ ప్రకటించింది. ప్రైమ్ నుంచి అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి నావిగేషన్ మెనూలు, గందరగోళ ఆప్షన్లతో యూజర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరైన నావిగేషన్ లేకపోవడం కారణంగా తమ సబ్ స్ర్కిప్షన్ క్యాన్సిల్ చేసుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

రాయిటర్స్ ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ యూజర్లు.. యూరోపియన్ యూనియన్‌లోని డెస్క్‌టాప్ డివైజ్‌లు, టాబ్లెట్‌లు, మొబైల్‌ల కోసం వెబ్‌సైట్‌ల నుంచి సబ్‌స్క్రిప్షన్‌లను వెంటనే రద్దు చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎంచుకోవడం యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా సులభమైన ప్రక్రియ కూడా. కానీ, సబ్ స్ర్కిప్షన్ తొలగించడమనేది కూడా అంతే ఈజీ.. ఆ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా యూజర్లు తమ హక్కులను వినియోగించుకోవాలి.

Amazon Prime Users Can Now Cancel Their Subscription In Just Two Clicks (1)

Amazon Prime Users Can Now Cancel Their Subscription In Just Two Clicks 

మానిప్యులేటివ్ డిజైన్‌లు లేదా ‘డార్క్ ప్యాటర్న్‌లు’ తప్పనిసరిగా నిషేధించాలి. యూజర్లు స్వేచ్ఛగా, సులభంగా అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకునేలా ఆప్షన్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని న్యాయ కమీషనర్, డిడియర్ రేండర్స్ చెప్పారు. అయితే, కస్టమర్‌లు సైన్ ఇన్ చేయడం, వారి సభ్యత్వాన్ని రద్దు చేయడం వంటి ప్రక్రియను సులభతరం చేసినట్లు Amazon తెలిపింది. ఈ కొత్త మార్పులు యూరోపియన్ యూనియన్‌లో మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. భారత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేసేందుకు సుదీర్ఘమైన ప్రక్రియను అనుసరించాలి.

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఎలా క్యాన్సిల్ చేయాలంటే?

– ముందుగా.. మీ స్మార్ట్‌ఫోన్‌లో అమెజాన్ యాప్‌ను ఓపెన్ చేసి.. స్క్రీన్ దిగువన హాంబర్గర్ మెనుపై Tap చేయండి.
– మీ ప్రైమ్ యాప్‌ను ఓపెన్ చేసి అకౌంట్‌పై నొక్కండి.. ఆపై కిందికి స్క్రోల్ చేయండి.
– Manage Prime membership సెక్షన్‌లోని ఆప్షన్‌పై నొక్కండి.
– మీ అకౌంట్ Manage membershipపై మళ్లీ నొక్కండి.
– ఇప్పుడు Membershipపై నొక్కండి.
– అక్కడే కిందిభాగంలో End membership బటన్ నొక్కండి.
– కిందికి స్క్రోల్ చేసి.. Continue to cancel నొక్కండి.

Read Also : Amazon Discount: అమెజాన్ ఆఫర్ల వర్షం.. సెలక్టెడ్ మొబైల్స్‌పై 51% డిస్కౌంట్

The post Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..! appeared first on 10TV.