America Scholarship : గ్రేట్.. కూలీ కొడుక్కి రూ.2.5కోట్ల స్కాలర్ షిప్.. ప్రపంచంలో ఆరుగురికే

అతడో కూలీ కొడుకు. నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి రోజూ కూలికి వెళ్తే కానీ వారి కుటుంబానికి నాలుగు మెతుకులు దొరకవు. అలాంటి కూలీ కొడుకు అద్భుతం చేశాడు. చదువులో తన టాలెంట్ చూపించాడు. ఏకంగా రూ.2.5 కోట్ల స్కాలర్ షిప్ కు అర్హత సాధించాడు. The post America Scholarship : గ్రేట్.. కూలీ కొడుక్కి రూ.2.5కోట్ల స్కాలర్ షిప్.. ప్రపంచంలో ఆరుగురికే appeared first on 10TV.

America Scholarship : గ్రేట్.. కూలీ కొడుక్కి రూ.2.5కోట్ల స్కాలర్ షిప్.. ప్రపంచంలో ఆరుగురికే

America Scholarship

America Scholarship : అతడో కూలీ కొడుకు. నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి రోజూ కూలికి వెళ్తే కానీ వారి కుటుంబానికి నాలుగు మెతుకులు దొరకవు. అలాంటి కూలీ కొడుకు అద్భుతం చేశాడు. చదువులో తన టాలెంట్ చూపించాడు. ఏకంగా రూ.2.5 కోట్ల స్కాలర్ షిప్ కు అర్హత సాధించాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

బీహార్ కు చెందిన కూలీ కొడుకు అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోసం రూ.2.5 కోట్ల స్కాలర్ షిప్ పొందాడు. పాట్నాకు సమీపంలోని గోన్పురాకు చెందిన ప్రేమ్(17) పెన్సిల్వేనియాలోని ప్రతిష్టాత్మక లాఫాయేట్ కాలేజీలో నాలుగేళ్ల పాటు మెకానికల్ ఇంజినీరింగ్ చదువుకోనున్నాడు. ఇది అమెరికాలోని టాప్-25 కాలేజీల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఆరుగురికి మాత్రమే ఈ స్కాలర్ షిప్ వచ్చింది. అందులో ప్రేమ్ ఒకడు కావడం తమకు గర్వ కారణం అంటున్నారు గ్రామస్తులు. ప్రేమ్ తండ్రి రోజువారీ కూలీ. తల్లి పదేళ్ల క్రితం చనిపోయింది.

Prem

Prem

కూలీ కొడుకు రూ.2.5 కోట్ల స్కాలర్ షిప్ కు అర్హత సాధించడం పట్ల ప్రేమ్ బంధువులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రియల్లీ గ్రేట్ అంటూ ప్రేమ్ ను ప్రశంసిస్తున్నారు. స్కాలర్ షిప్ ఇవ్వడమే కాదు.. ప్రేమ్ ఇతర ఖర్చులను కూడా కాలేజీ వాళ్లే చూసుకుంటారు. లాఫాయేట్ కాలేజీ 1826లో స్థాపించారు. అమెరికాలోని టాప్ 25 కాలేజీల్లో ఇదొకటి. ఇక ఈ స్కాలర్ షిప్ కి అర్హత సాధించిన తొలి భారత మహాదళిత్ విద్యార్థి ప్రేమే.

Prem (1)

Prem (1)

 

The post America Scholarship : గ్రేట్.. కూలీ కొడుక్కి రూ.2.5కోట్ల స్కాలర్ షిప్.. ప్రపంచంలో ఆరుగురికే appeared first on 10TV.