Anasuya Movie Release Date: థియేటర్లలో అనసూయ 'దర్జా' - మామూలుగా ఉండదు మరి

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దర్జా'. సునీల్ (Sunil) మరో ప్రధాన పాత్రధారి. జూలై 22న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు (Darja Movie Release Date) దర్శక - నిర్మాతలు వెల్లడించారు. 'దర్జా' సినిమాలో అనసూయ ప‌వ‌ర్‌ఫుల్‌ యాక్షన్ రోల్ చేశారు. ఆల్రెడీ విడుదలైన స్టిల్స్ చూస్తే ఆ విషయం తెలుస్తుంది. కత్తి చేతపట్టి... సిగరెట్ వెలిగించి... నటిగా కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. 'పుష్ప'లో అనసూయ నెగిటివ్ టచ్ ఉన్న మాస్ రోల్ చేశారు అనసూయ. ఇదీ ఆ తరహా రోల్ అని టాక్. తెలుగులో జూలై 22న అక్కినేని నాగచైతన్య 'థాంక్యూ', నిఖిల్ అండ్ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' విడుదల అవుతున్నాయి. ఆ రెండు సినిమాలతో అనసూయ 'దర్జా'కు పోటీ ఎదురవుతుంది.  Also Read : కొత్త కారు కొన్న 'జబర్దస్త్' వర్ష - రేటు ఎంతో తెలిస్తే షాక్ గ్యారెంటీ 'దర్జా' చిత్రాన్ని సలీమ్ మాలిక్ దర్శకత్వంలో కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఇందులో ఆమని, 'జబర్దస్త్' అఖ్సా ఖాన్, 'షకలక' శంకర్, 'మిర్చి' హేమంత్, 'ఛత్రపతి' శేఖర్, నాగ మహేష్, 'షేకింగ్' శేషు, 'జబర్దస్త్' నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ సంగీత దర్శకుడు.  Also Read : 'కెజియఫ్'లో బానిసల్లా, కుక్కల్లా చూస్తే ఎవరుంటారు? 'హైపర్' ఆది కూడా మానేస్తున్నాడు - 'జబర్దస్త్'పై 'కిరాక్' ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్           View this post on Instagram                       A post shared by Director Saleem Malik (@director_saleem)

Anasuya Movie Release Date: థియేటర్లలో అనసూయ 'దర్జా' - మామూలుగా ఉండదు మరి

ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దర్జా'. సునీల్ (Sunil) మరో ప్రధాన పాత్రధారి. జూలై 22న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు (Darja Movie Release Date) దర్శక - నిర్మాతలు వెల్లడించారు.

'దర్జా' సినిమాలో అనసూయ ప‌వ‌ర్‌ఫుల్‌ యాక్షన్ రోల్ చేశారు. ఆల్రెడీ విడుదలైన స్టిల్స్ చూస్తే ఆ విషయం తెలుస్తుంది. కత్తి చేతపట్టి... సిగరెట్ వెలిగించి... నటిగా కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. 'పుష్ప'లో అనసూయ నెగిటివ్ టచ్ ఉన్న మాస్ రోల్ చేశారు అనసూయ. ఇదీ ఆ తరహా రోల్ అని టాక్. తెలుగులో జూలై 22న అక్కినేని నాగచైతన్య 'థాంక్యూ', నిఖిల్ అండ్ అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన 'కార్తికేయ 2' విడుదల అవుతున్నాయి. ఆ రెండు సినిమాలతో అనసూయ 'దర్జా'కు పోటీ ఎదురవుతుంది. 

Also Read : కొత్త కారు కొన్న 'జబర్దస్త్' వర్ష - రేటు ఎంతో తెలిస్తే షాక్ గ్యారెంటీ

'దర్జా' చిత్రాన్ని సలీమ్ మాలిక్ దర్శకత్వంలో కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మించారు. ఇందులో ఆమని, 'జబర్దస్త్' అఖ్సా ఖాన్, 'షకలక' శంకర్, 'మిర్చి' హేమంత్, 'ఛత్రపతి' శేఖర్, నాగ మహేష్, 'షేకింగ్' శేషు, 'జబర్దస్త్' నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ర్యాప్ రాక్ షకీల్ సంగీత దర్శకుడు. 

Also Read : 'కెజియఫ్'లో బానిసల్లా, కుక్కల్లా చూస్తే ఎవరుంటారు? 'హైపర్' ఆది కూడా మానేస్తున్నాడు - 'జబర్దస్త్'పై 'కిరాక్' ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Director Saleem Malik (@director_saleem)