Andhra Pradesh: కోనసీమ జిల్లాలో మరో వివాదం.. పేపర్ ప్లేట్లో అంబేద్కర్ ఫోటో..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో మరో వివాదం చెలరేగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు..

Andhra Pradesh: కోనసీమ జిల్లాలో మరో వివాదం.. పేపర్ ప్లేట్లో అంబేద్కర్ ఫోటో..
Ambedkar

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో మరో వివాదం చెలరేగింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు అవమానం జరిగింది. జిల్లాలోని కొత్తపేట రావులపాలెం మండలం, గోపాలపురంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అంబేద్కర్ ఫోటోలు ఉన్న పేపర్ ప్లేట్లలో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. డిస్పోజబుల్ పేపర్ ప్లేట్స్ పై అంబేద్కర్ ఫోటో ముద్రించారు. అదే ప్లేట్స్ లో ఫాస్ట్ ఫుడ్ సరఫరా చేశారు. ఇది గమనించిన పలువురు హోటల్ వద్ద ఘర్షణకు దిగారు. విషయం పోలీసులకు తెలియడంతో.. హోటల్ యజమాని సహా ప్లేట్లు సరఫరా చేసిన వ్యాపారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. కాగా, హోటల్ పై దాడి చేసి వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టేలా ప్రచారాలు చేసిన 17 మందిపైనా కేసు నమోదు చేసిన రావులపాలెం పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..