Andhra Pradesh Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ..

అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లను 1070, 18004250101, 08632377118 సంప్రదించాలన్నారు.

Andhra Pradesh Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ..
Rains Hyd

Andhra Pradesh: ఒడిశాతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైందని ఐఎండీ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రేపు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన సూచించారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు.

వర్షాకాలం భారీవర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ఏపీ విపత్తుల సంస్థ ముందస్తుగా అప్రమత్తం అయినట్లు ఆయన తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తామన్నారు. జిల్లాల యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు, జిల్లాల్లో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

ప్రజలు వారి ప్రాంతంలో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. అత్యవసర సహాయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లను 1070, 18004250101, 08632377118 సంప్రదించాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.