Andhra Pradesh: నా కుమారుడిని విడుదల చేయండి.. సీజేఐకి కోడికత్తి కేసు నిందితుడి తల్లి లేఖ

కోడి కత్తి కేసు గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.ఎన్వీ రమణకు శ్రీనివాస్ తల్లి లేఖ రాశారు. తన కుమారుడిని రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల చేయాలని లేఖలో కోరారు. 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టు లో శ్రీనివాస్ అనే...

Andhra Pradesh: నా కుమారుడిని విడుదల చేయండి.. సీజేఐకి కోడికత్తి కేసు నిందితుడి తల్లి లేఖ
Kodikatthi Case

కోడి కత్తి కేసు గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.ఎన్వీ రమణకు శ్రీనివాస్ తల్లి లేఖ రాశారు. తన కుమారుడిని రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదల చేయాలని లేఖలో కోరారు. 2018 అక్టోబర్ 25న విశాఖపట్నం ఎయిర్ పోర్టు లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 2019 మే 25న నిందితుడికి బెయిల్ మంజూరైంది. అయితే 2019 ఆగష్టు 13న బెయిల్ రద్దు కావడంతో శ్రీనివాస్ మళ్లీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నాడు. సీఎం జగన్‌పై కోడికత్తి దాడి జరిగి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు పూర్తయినా కేసులో శ్రీనివాస్ ఇప్పటికీ రిమాండ్ లోనే ఉన్నాడు. ఈ మేరకు తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ అతని తల్లి సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. న్యాయస్థానంలో ఎన్‌ఐఏ విచారణ జరిగినప్పటికీ ఇప్పటివరకు సరైన న్యాయం జరగటం లేదని చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు.\

2018లో ఈ దాడి ఘటన జరిగింది. విజయనగరం జిల్లాలో పాదయాత్రను ముగించుకుని హైదరాబాద్ కు వెళ్లేందుకు వైజాగ్ ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. ఆ సమయంలోనే ఆయనపై దాడి జరిగింది. కోడిపందేల్లో వాడే కత్తితో జగన్ పై శ్రీనివాస్ దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి