Apple School Offers : ఆపిల్ బ్యాక్ టూ స్కూల్ కొత్త ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..!
భారతీయ కస్టమర్ల కోసం ఆపిల్ దిగ్గజం బ్యాక్ టూ స్కూల్ ప్రొగ్రామ్ కింద కొత్త ఆఫర్లను ప్రకటించింది. The post Apple School Offers : ఆపిల్ బ్యాక్ టూ స్కూల్ కొత్త ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..! appeared first on 10TV.
Apple School Offers : భారతీయ కస్టమర్ల కోసం ఆపిల్ దిగ్గజం బ్యాక్ టూ స్కూల్ ప్రొగ్రామ్ కింద కొత్త ఆఫర్లను ప్రకటించింది. ఈ ప్రొగ్రామ్ కింద యూనివర్శిటీ విద్యార్థులు, అధ్యాపకులు Apple అందించే విద్యపరమైన డివైజ్‌లను డిస్కౌంట్ ధరలకే సొంతం చేసుకోవచ్చు. అర్హత కలిగిన iPad, Mac ధరలపై తగ్గింపు పొందవచ్చు. అర్హత కలిగిన కస్టమర్‌లు 6 నెలల పాటు ఆపిల్ మ్యూజిక్‌తో పాటు ఫ్రీగా ఫెయిర్ ఎయిర్‌పాడ్‌లను సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఎడ్యుకేషన్ ప్రైసింగ్ బ్యాక్ టు స్కూల్” ప్రోగ్రామ్ కింద ఈ కొత్త ఆఫర్లు సెప్టెంబర్ 22 వరకు అందుబాటులో ఉంటాయి.
కంపెనీ డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేసే డివైజ్ లిస్టులను ఆపిల్ వెల్లడించింది. Apple Care+పై కస్టమర్‌లు 20 శాతం తగ్గింపును పొందవచ్చు. ఈ ప్రొగ్రామ్ కింద.. విద్యార్థులు, అధ్యాపకులు అర్హత కలిగిన సిబ్బంది ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ రూ.50,780కి కొనుగోలు చేయవచ్చు. iPad Air Gen 5 భారత మార్కెట్లో అధికారికంగా రూ. 54,900కి అందుబాటులో ఉంది. కస్టమర్‌లు 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో (3వ జనరేషన్) 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో (5వ జనరేషన్)ని కూడా తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. 11వ జనరేషన్ ఐప్యాడ్ ప్రోను రూ. 68,300 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్‌లో భాగంగా Apple కొత్త MacBook Air M2, MacBook Pro M2లపై కూడా డిస్కౌంట్ ధరకు పొందవచ్చు. M2 MacBook Airని రూ. 1,09,900కి కొనుగోలు చేయవచ్చు. అయితే M2 MacBook Proని రూ. 1,19,900కి కొనుగోలు చేయవచ్చు.
M1 మ్యాక్‌బుక్ ఎయిర్‌ను కొనుగోలు చేస్తే.. రూ. 89,900 ప్రారంభ ధరకు సొంతం చేసుకోవచ్చు. M1 Pro, M1 మ్యాక్స్ చిప్ ఆప్షన్లతో MacBook Pro 14-అంగుళాల ప్రారంభ ధర రూ.1,75,410గా ఉంది. మరోవైపు 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో రూ.2,15,910కి కొనుగోలు చేయవచ్చు. M1 iMac, మల్టీ కలర్ ఆప్షన్లతో వచ్చిన పెద్ద 24-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. బ్యాక్ టు స్కూల్ ఆఫర్‌లో భాగంగా రూ. 1,07,910కి అందుబాటులో ఉంది.
Mac లేదా iPad మోడల్‌లలో ఏదైనా కొనుగోలు చేస్తే.. కస్టమర్‌లు ఉచితంగా పెయిర్ AirPodలను సొంతం చేసుకోవచ్చు. అదనంగా రూ. 6,400 చెల్లించి AirPods Gen3కి లేదా పైన రూ. 12,200 చెల్లించి AirPods Proకి అప్‌గ్రేడ్ చేయవచ్చు. Apple ఎడ్యుకేషన్ ప్రైసింగ్ యూనివర్శిటీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు.. అలాగే అన్ని గ్రేడ్ స్థాయిల అధ్యాపకులు, సిబ్బంది, హోమ్‌స్కూల్ ఉపాధ్యాయులకు అందుబాటులోనే ఉన్నాయి.
Read Also : Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
The post Apple School Offers : ఆపిల్ బ్యాక్ టూ స్కూల్ కొత్త ఆఫర్లు.. భారీ డిస్కౌంట్లు.. డోంట్ మిస్..! appeared first on 10TV.