China provokes India: ఇండియాను రెచ్చగొట్టిన చైనా.. లదాఖ్ సరిహద్దులోకి చైనా విమానం

గత నెల చివరి వారంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏ పరిస్థితి ఎదరైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది. చైనా విమానం దూసుకొచ్చిన విషయాన్ని భారత ఆర్మీ, చైనా దృష్టికి తీసుకెళ్లింది. The post China provokes India: ఇండియాను రెచ్చగొట్టిన చైనా.. లదాఖ్ సరిహద్దులోకి చైనా విమానం appeared first on 10TV.

China provokes India: ఇండియాను రెచ్చగొట్టిన చైనా.. లదాఖ్ సరిహద్దులోకి చైనా విమానం

China Provokes India

China provokes India: ఇండియను రెచ్చగొట్టే దుందుడుకు చర్యలను చైనా మానుకోవడం లేదు. ఇటీవల మరోసారి చైనా, ఇండియాను రెచ్చగొట్టే చర్యకు దిగింది. చైనాకు చెందిన యుద్ధ విమానం ఒకటి భారత సరిహద్దులోని తూర్పు లదాఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్దకు దూసుకొచ్చింది.

Dr K Laxman: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన డా.కె.లక్ష్మణ్

గత నెల చివరి వారంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏ పరిస్థితి ఎదరైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది. చైనా విమానం దూసుకొచ్చిన విషయాన్ని భారత ఆర్మీ, చైనా దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన చైనా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. లదాఖ్ ప్రాంతంలో చైనా ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఒక ఎక్సర్‌సైజ్ సందర్భంగా విమానం ఇలా భారత సరిహద్దులోకి వచ్చినట్లు తెలిసింది.

Student Dead: ఆడుకుంటుండగా చెట్టు కూలి విద్యార్థిని మృతి

2020లో చైనాతో సరిహద్దులో నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో అక్కడ భద్రతను భారత ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. చైనా నుంచి ఎలాంటి సవాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు సైన్యాన్ని అన్నిరకాలుగా సిద్ధం చేసింది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగేవి. చాలా కాలం తర్వాత చైనా ఇలాంటి చర్యకు దిగింది.

The post China provokes India: ఇండియాను రెచ్చగొట్టిన చైనా.. లదాఖ్ సరిహద్దులోకి చైనా విమానం appeared first on 10TV.