CM Eknath Shinde : నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని ఆదేశించిన సీఎం షిండే

 ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌తో భేటీ అయిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దని..సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు’ అని ఆదేశించారు. The post CM Eknath Shinde : నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని ఆదేశించిన సీఎం షిండే appeared first on 10TV.

CM Eknath Shinde : నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని ఆదేశించిన సీఎం షిండే

Eknath Shinde Orders So Protocal To His Convoy

CM Eknath Shinde : ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌తో భేటీ అయిన మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపొద్దని..సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు’ అని ఆదేశించారు. వీఐపీల సెక్యూరిటీపై క‌మిష‌న‌ర్‌తో చ‌ర్చ‌ించిన సీఎం ‘మాది సామాన్యుల ప్ర‌భుత్వ‌ం అని నా కాన్వాయ్ కు ఎటువంటి ప్రొటోకాల్ కూడా అవసరం లేదని స్పష్టంచేశారు. త‌న మార్గంలో భ‌ద్ర‌త‌ను త‌గ్గించాల‌ని ఆదేశించారు.

శుక్ర‌వారం (జులై 9,2022) ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్‌తో స‌మావేశ‌మైన సంద‌ర్భంగా షిండే ఈ ఆదేశాలు జారీ చేశారు. వీవీఐపీల ప్ర‌యాణాల కోసం సామాన్యులు ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎ షిండే తెలిపారు. వీఐపీల వల్ల ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బంది కలుకకూడదని..వారి పడు ఇబ్బంది తనకు తెలుసని అందుకే ఈ ఇబ్బందిని తొల‌గించేందుకు సీఎం కాన్వాయ్‌కు ఎలాంటి ప్రొటోకాల్ పాటించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స్పష్టంచేశారు.

అంతేకాదు..తన ప్ర‌యాణించే మార్గంలో భ‌ద్ర‌త‌ను కూడా త‌గ్గించాల‌ని ముంబై పోలీస్ కమిషనర్ కు సూచించారు. మాది సామాన్యుల ప్ర‌భుత్వ‌ం..సామాన్యులకు ఇబ్ంది కలిగే ఎటువంటి ప్రొటోకాల్ అవసరం లేదని అన్నారు. వీఐపీల క‌న్నా… సామాన్యుల‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌నుకుంటున్నామ‌ని ఈ సందర్బంగా సీఎం షిండే తెలిపారు.

కాగా ఓ సాధారణ ఆటో డ్రైవర్ స్థాయినుంచి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా మహారాష్ట్రం సీఎం అయ్యారు ఏక్ నాథ్ షిండే.మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వాన్ని బీజేపీ సహాయంతో కూల్చి వేసి సీఎం అయ్యారు.

 

The post CM Eknath Shinde : నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని ఆదేశించిన సీఎం షిండే appeared first on 10TV.