Eknath Shinde: షిండేకు ఆటోవాలాల మద్దతు.. ఉద్ధవ్‌కు కౌంటర్

తను ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం మూడు చక్రాల బండి అని, అయితే దీన్ని ఇప్పుడు షిండే తీసుకుని నడుపుతున్నాడని ఉద్ధవ్ వ్యాఖ్యానించాడు. పరోక్షంగా షిండే ఒక ఆటో డ్రైవర్ అనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్య చేశాడు. The post Eknath Shinde: షిండేకు ఆటోవాలాల మద్దతు.. ఉద్ధవ్‌కు కౌంటర్ appeared first on 10TV.

Eknath Shinde: షిండేకు ఆటోవాలాల మద్దతు.. ఉద్ధవ్‌కు కౌంటర్

Eknath Shinde

Eknath Shinde: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఆటోవాలాలు మద్దతు తెలుపుతున్నారు. థానె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో షిండేకు మద్దతుగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. గతంలో షిండే ఆటోవాలాగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షిండేను విమర్శిస్తూ ఉద్ధవ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు.

TTD: తిరుమలలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం .. రేపు సెప్టెంబర్ వసతి కోటా టిక్కెట్ల విడుదల

తను ముఖ్యమంత్రిగా ఉన్న మహా వికాస్ అఘాడి (శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ) ప్రభుత్వం మూడు చక్రాల బండి అని, అయితే దీన్ని ఇప్పుడు షిండే తీసుకుని నడుపుతున్నాడని ఉద్ధవ్ వ్యాఖ్యానించాడు. పరోక్షంగా షిండే ఒక ఆటో డ్రైవర్ అనే అర్థం వచ్చేలా ఈ వ్యాఖ్య చేశాడు. దీనికి మరుసటి రోజు షిండే కౌంటర్ ఇచ్చాడు. మెర్సిడెస్ కారును ఆటోరిక్షా (తన ప్రభుత్వం) దాటేసిందని ఆయన అన్నాడు. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వమని వ్యాఖ్యానించాడు. ఉద్ధవ్ తన పదవికి రాజీనామా చేసేందుకు మెర్సిడెస్ కారులో వెళ్లాడు. అందుకే ఉద్ధవ్ మెర్సిడెస్ కారును, తను గతంలో నడిపిన ఆటోరిక్షాను పోలుస్తూ షిండే ఈ వ్యాఖ్యలు చేశాడు.

S Jaishankar: భారత విద్యార్థుల్ని అనుమతించండి.. చైనా మంత్రిని కోరిన భారత్

మరోవైపు షిండేకు మద్దతుగా ఆటోవాలాలు బ్యానర్లు కడుతున్నారు. తమలోంచి ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు గర్వంగా ఉందన్నారు. థానె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వంద మంది ఆటో రిక్షా డ్రైవర్లు సమావేశమై షిండేకు మద్దతు తెలిపారు. తమ ఆటోలపై షిండేతో కూడిన స్టిక్కర్లు అంటించుకున్నారు.

The post Eknath Shinde: షిండేకు ఆటోవాలాల మద్దతు.. ఉద్ధవ్‌కు కౌంటర్ appeared first on 10TV.