Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?

ప్రపంచానికి ఇతడో కామెడీ మ్యాన్.. ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఏం చేస్తాడో చెప్పలేం. అతడి నిర్ణయాలు ఊహాకు అందనంతగా ఉంటాయి. The post Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే? appeared first on 10TV.

Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?

Billionaire Elon Musk Now Has 100 Million Followers On Twitter (1)

Elon Musk : ప్రపంచానికి ఇతడో కామెడీ మ్యాన్.. ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఏం చేస్తాడో చెప్పలేం. అతడి నిర్ణయాలు ఊహాకు అందనంతగా ఉంటాయి. అతడే.. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్. అలాంటి మస్క్ పుట్టినరోజు ఎంత ఏదో ప్రత్యేకించి ఉండాల్సిందే.. ఈరోజు 51ఏళ్లు పూర్తి చేసుకున్న మస్క్ పుట్టినరోజున ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పుట్టినరోజునే తన ట్విట్టర్ ఫాలోవర్లు 100 మిలియన్ల మార్కును చేరింది. ట్విట్టర్ డీల్‌ సమయంలోనే మస్క్ ట్విట్టర్ ఫాలోవర్లు 100 మిలియన్లు దాటారు. రాబోయే రోజుల్లో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నారు. అంతలోనే బిలియనీర్ ఈ మైలురాయిని సాధించాడు. మస్క్ కొన్ని నెలల క్రితమే ట్విట్టర్‌ని కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించాడు.

కానీ, డీల్ ఇంకా ముగియ లేదు. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లో స్పామ్ బాట్‌లపై వివరాలను ట్విట్టర్ షేర్ చేసే వరకు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు టెస్లా సీఈఓ వెల్లడించారు. గత త్రైమాసికంలో ప్లాట్‌ఫారమ్‌లో 5 శాతం బాట్‌లు ఉన్నాయని ట్విట్టర్ లేటెస్టు డేటాలో తెలిపింది. అయితే ప్లాట్‌ఫారమ్‌పై కనీసం 20 శాతం బాట్‌లు ఉన్నాయని మస్క్ చెబుతున్నారు. అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరి నాటికి మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్ ఉద్యోగులను వీడియో కాల్ ద్వారా మస్క్ కలిశాడు. అలాగే డీల్, ఉద్యోగుల తొలగింపులు, రిమోట్ వర్క్ అన్నింటిపై మస్క్ మాట్లాడాడు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ట్విట్టర్‌లో ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని మస్క్ సూచించాడు.

Billionaire Elon Musk Now Has 100 Million Followers On Twitter (2)

Billionaire Elon Musk Now Has 100 Million Followers On Twitter 

బిలియనీర్ ఇటీవల టెస్లా ఉద్యోగులందరినీ తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశించాడు. లేదంటే ఉద్యోగం మానేయాలని సూచించాడు మస్క్. ప్రతి ఉద్యోగి వారానికి కనీసం 40 గంటలపాటు పని చేయాలని ఆయన సూచించారు. రిమోట్ పని చేయాలనుకునే ఎవరైనా తప్పనిసరిగా వారానికి కనీసం 40 గంటలు లేదా టెస్లా నుంచి రిజైన్ చేసి వెళ్లిపోవాలని మస్క్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌ లో పేర్కొన్నాడు.

ఆఫీసు అనేది.. అది తప్పకుండా ఒక టెస్లా ప్రధాన ఆఫీసు అయి ఉండాలన్నాడు. ఉద్యోగ విధులతో సంబంధం లేని రిమోట్ బ్రాంచ్ కార్యాలయం వద్దన్నాడు. ట్విట్టర్ ఉద్యోగులతో కాల్ సమయంలో బిలియనీర్ తమ కంపెనీలో అద్భుతంగా పనిచేసే వర్కర్లకు ఇంటి నుంచి కొనసాగించవచ్చని చెప్పారు. ఎవరైనా రిమోట్‌గా మాత్రమే పని చేయగలిగితే.. వారు అసాధారణమైన వారైతే, వారిని తొలగించడంలో వెనుకాడేది లేదని మస్క్ స్పష్టం చేశాడు.

Read Also : Twitter CC : ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అలర్ట్.. ట్విట్టర్ వీడియోల్లో CC బటన్..!

The post Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే? appeared first on 10TV.