EV Battery : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1,000 కిలోమీటర్లు నడిచే బ్యాటరీ
రాబోయే రోజుల్లో రోడ్లమీద అంతా ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనమిస్తాయి. ఇప్పుడున్న పెట్రోల్ బంకుల మాదిరిగానే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు వెలుస్తాయి. The post EV Battery : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1,000 కిలోమీటర్లు నడిచే బ్యాటరీ appeared first on 10TV.
EV Battery : రాబోయే రోజుల్లో రోడ్లమీద అంతా ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనమిస్తాయి. ఇప్పుడున్న పెట్రోల్ బంకుల మాదిరిగానే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు వెలుస్తాయి. ఒక్కసారి 10 నిమిషాలు చార్జింగ్ పెడితే వెయ్యి కిలోమీటర్లు దూసుకు వెళ్లేందుకు వీలుగా చైనాకు చెందిన ఓ సంస్ధ కొత్త బ్యాటరీని రూపోందించింది.
కాంటెంపరరీ అంపెరెక్స్ టెక్నాలజీ అనే సంస్ధ సెల్ టు ప్యాక్ (సీటీపీ) థర్డ్ జెనరేషన్ సాంకేతికతతో ‘క్విలిన్’ పేరిట ఈ బ్యాటరీని రూపొందించింది. వచ్చే ఏడాది నాటికి ఈ బ్యాటరీలు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నడిచే బ్యాటరీ ఇదేనని చెబుతున్నారు.
ఈ బ్యాటరీల ఎక్కువ కాలం మన్నడమే కాకుండా, భద్రత విషయంలో కూడా చాలా బాగుంటుందని చెబుతున్నారు. పైగా కేవలం 10 నిమిషాల్లోనే చార్జింగ్ పూర్తవుతుందని పేర్కొంటున్నారు. బ్యాటరీ థర్మల్ స్టెబిలిటీ మరియు సేఫ్టీని కలిగి ఉంది. చైనీస్ పురాణాలలోని క్విలిన్ అనే పేరు ఈ బ్యాటరీకి పెట్టినట్లు చైనాకు చెందిన వార్తా సంస్ధ తెలిపింది.
టెస్లా.వోక్స్ వ్యాగన్, బీఎమ్డబ్ల్యూతో సహ క్లయింట్ లుగా ఉన్న CATL చైనాలోని నాలుగు నగరాల్లో లిథియం అయాన్ బ్యాటరీ తయారీని అప్ గ్రేడ్ చేయటానికి సుమారు రూ. 52,425 కోట్లు సేకరించిందని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద EV బ్యాటరీ తయారు దారు అయినప్పటికీ CATL ఇటీవల కోవిడ్ కారణంగా నష్టాలనుంచి ఒడ్డెక్కటానికి చాలా కష్ట పడుతోంది. CATL మొదటి త్రైమాసిక నికర ఆదాయం అంతకు ముందు సంవత్సరం కంటే 24 శాతం పడిపోయింది.
Also Read : Blast : మేడ్చల్ జిల్లాలో పేలుడు-మహిళ మృతి
The post EV Battery : ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1,000 కిలోమీటర్లు నడిచే బ్యాటరీ appeared first on 10TV.