EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం

ఈవీ చార్జింగ్ స్టేషన్ లేని బిల్డింగులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. నోయిడాలో ఈ కొత్త చట్టానికి సంబంధించి ‘బిల్డింగ్ మ్యాన్యువల్ 2010’లో గత మే 3న మార్పులు చేశారు. అంటే దీని ప్రకారం ప్రతి బిల్డింగులో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. The post EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం appeared first on 10TV.

EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం

Ev Charging Station

EV Charging Station: భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా. దీంతో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే నోయిడా పాలకవర్గం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై కట్టబోయే కొత్త బిల్డింగులలో ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరిగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

RC15: బ్యాక్ టు హైదరాబాద్!

ఈవీ చార్జింగ్ స్టేషన్ లేని బిల్డింగులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. నోయిడాలో ఈ కొత్త చట్టానికి సంబంధించి ‘బిల్డింగ్ మ్యాన్యువల్ 2010’లో గత మే 3న మార్పులు చేశారు. అంటే దీని ప్రకారం ప్రతి బిల్డింగులో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. తాజా నిర్ణయం ద్వారా నోయిడాలో ఎలక్ట్రిక్ వాహనాల్ని ప్రోత్సహించినట్లవుతుందని, ప్రజలు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారని నోయిడా వాసులు అంటున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఈవీల వినియోగం పెరిగింది. గత మార్చి 25 నాటికి దేశవ్యాప్తంగా, 10,76,420 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు సమాచారం. దేశంలో 1,742 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి.

Prime Day Sale: స్మార్ట్ ఫోన్లపై 40శాతం డిస్కౌంట్లతో ప్రైమ్ డే సేల్

సూరత్, బెంగళూరు, పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలలో దాదాపు 940 స్టేషన్లు ఉన్నాయి. అయితే, వాహనాల సంఖ్యకు తగ్గట్లుగా పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు లేవు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీలతో కలిపి ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. 68 నగరాల్లో 2,877 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతించింది.

The post EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం appeared first on 10TV.