Hair Straighten Tips: మీ జుట్టు స్ట్రైట్నింగ్ చేస్తుంటే రాలిపోతుందా? ఈ టిప్స్ మీకోసమే

అమ్మాయిల అందాన్ని రెట్టింపుచేసేది వాళ్ళ కురులే. పొడవు జడ ఉన్న వాళ్ళని చూస్తే అబ్బా.. ఏముంది రా ఆ జడ అని అనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా పొడవు జడ ఉన్న వాళ్ళని ఇష్టపడుతున్నారంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు విషయంలో అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జుట్టు స్ట్రైట్ చేసుకోవడానికి అమ్మాయిలు అనేక మార్గాలు ఉపయోగిస్తారు. ఇంతక ముందయితే జుట్టు ఆరబెట్టుకోవడానికి శుభ్రంగా టవల్ తో తుడుచుకుని సాంబ్రాణి పొగ వేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అంత తీరిక ఓపిక ఎవరికి ఉండటం లేదు. మార్కెట్లో హెయిర్ డ్రయర్లు వచ్చిన తర్వాత వాటి వినియోగం ఎక్కువ అయిపోతుంది. వాటితో స్ట్రైటనింగ్ చేసుకుంటున్నారు. ఇలా చెయ్యడం వల్ల జుట్టు చివర చిట్లి పోవడంతో పాటు ఎక్కువగా రాలిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించి మీ జుట్టు అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేందుకు అవసరమైన వస్తువులు మనకి మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించకుండా సాధారణ పద్ధతిలో కూడా మనం జుట్టు మృదువుగా ఉండేలా చూసుకోవచ్చు. తలస్నానం చేసేటప్పుడు ఎడపెడా రుద్దకుండా మాయిశ్చరైజర్ మాదిరిగా రుద్దుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీ జూట్టు చాలా మృదువుగా చిక్కు లేకుండా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. తల స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకునేందుకు చాలా మంది హెయిర్ డ్రయర్స్ ఉపయోగిస్తారు. వాటి నుంచి వచ్చే వేడి గాలితో జుట్టు ఆరబెట్టుకుంటే హెయిర్ డామేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకని టవల్ తో మృదువుగా తుడుచుకుంటూ ఉండాలి. ఇలా చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అంత సమయం లేనప్పుడు హెయిర్ డ్రయర్లో తక్కువ ఉష్ణోగ్రత పెట్టుకుని జుట్టుని అరబెట్టుకోవాలి. స్ట్రైట్నింగ్  చేసుకునేందుకు కూడా ఉష్ణోగ్రత తక్కువగా పెట్టుకుని చేసుకోవడం ఉత్తమం.  Also read: శిక్షణ పొందిన పైలెట్‌ అతను, కానీ జొమాటో డెలివరీ బాయ్‌గా మారిపోయాడు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు Also Read: మునక్కాయల నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలు తినొచ్చు తల స్నానం చేసిన వెంటనే దువ్వెనతో దువ్వడం అస్సలు చెయ్యకూడదు. ఆ సమయంలో మన తల మెత్తగా నాని ఉండటం వల్ల జుట్టు తేలికగా రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత దువ్వుకోవడం మంచిది. తడి తలతో జుట్టు దువ్వుకోకుండా అస్సలు పడుకోకూడదు. దాని వల్ల తల నొప్పి రావడమే కాకుండా జుట్టు చిక్కుపడుతుంది. దాన్ని సరి చేసుకునే క్రమంలో మరింత హెయిర్ డామేజ్ ఉంటుంది. జుట్టుకి ఎప్పటికప్పుడు కొబ్బరి నూనె పెడుతూ మసాజ్ చేసుకోవాలి. తల స్నానం చేసే ముందు కొద్ది సేపు నూనె పెట్టుకుని మర్ధన చేసుకున్న ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.   

Hair Straighten Tips: మీ జుట్టు స్ట్రైట్నింగ్ చేస్తుంటే రాలిపోతుందా? ఈ టిప్స్ మీకోసమే

అమ్మాయిల అందాన్ని రెట్టింపుచేసేది వాళ్ళ కురులే. పొడవు జడ ఉన్న వాళ్ళని చూస్తే అబ్బా.. ఏముంది రా ఆ జడ అని అనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా పొడవు జడ ఉన్న వాళ్ళని ఇష్టపడుతున్నారంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే జుట్టు విషయంలో అందరూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జుట్టు స్ట్రైట్ చేసుకోవడానికి అమ్మాయిలు అనేక మార్గాలు ఉపయోగిస్తారు. ఇంతక ముందయితే జుట్టు ఆరబెట్టుకోవడానికి శుభ్రంగా టవల్ తో తుడుచుకుని సాంబ్రాణి పొగ వేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అంత తీరిక ఓపిక ఎవరికి ఉండటం లేదు. మార్కెట్లో హెయిర్ డ్రయర్లు వచ్చిన తర్వాత వాటి వినియోగం ఎక్కువ అయిపోతుంది. వాటితో స్ట్రైటనింగ్ చేసుకుంటున్నారు. ఇలా చెయ్యడం వల్ల జుట్టు చివర చిట్లి పోవడంతో పాటు ఎక్కువగా రాలిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించి మీ జుట్టు అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి. హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునేందుకు అవసరమైన వస్తువులు మనకి మార్కెట్లో చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించకుండా సాధారణ పద్ధతిలో కూడా మనం జుట్టు మృదువుగా ఉండేలా చూసుకోవచ్చు.

తలస్నానం చేసేటప్పుడు ఎడపెడా రుద్దకుండా మాయిశ్చరైజర్ మాదిరిగా రుద్దుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీ జూట్టు చాలా మృదువుగా చిక్కు లేకుండా ఉంటుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. తల స్నానం చేసిన తర్వాత జుట్టు ఆరబెట్టుకునేందుకు చాలా మంది హెయిర్ డ్రయర్స్ ఉపయోగిస్తారు. వాటి నుంచి వచ్చే వేడి గాలితో జుట్టు ఆరబెట్టుకుంటే హెయిర్ డామేజ్ ఎక్కువగా ఉంటుంది. అందుకని టవల్ తో మృదువుగా తుడుచుకుంటూ ఉండాలి. ఇలా చేసుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అంత సమయం లేనప్పుడు హెయిర్ డ్రయర్లో తక్కువ ఉష్ణోగ్రత పెట్టుకుని జుట్టుని అరబెట్టుకోవాలి. స్ట్రైట్నింగ్  చేసుకునేందుకు కూడా ఉష్ణోగ్రత తక్కువగా పెట్టుకుని చేసుకోవడం ఉత్తమం. 

Also read: శిక్షణ పొందిన పైలెట్‌ అతను, కానీ జొమాటో డెలివరీ బాయ్‌గా మారిపోయాడు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Also Read: మునక్కాయల నిల్వ పచ్చడి, ఇలా చేస్తే ఆరునెలలు తినొచ్చు

తల స్నానం చేసిన వెంటనే దువ్వెనతో దువ్వడం అస్సలు చెయ్యకూడదు. ఆ సమయంలో మన తల మెత్తగా నాని ఉండటం వల్ల జుట్టు తేలికగా రాలిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత దువ్వుకోవడం మంచిది. తడి తలతో జుట్టు దువ్వుకోకుండా అస్సలు పడుకోకూడదు. దాని వల్ల తల నొప్పి రావడమే కాకుండా జుట్టు చిక్కుపడుతుంది. దాన్ని సరి చేసుకునే క్రమంలో మరింత హెయిర్ డామేజ్ ఉంటుంది. జుట్టుకి ఎప్పటికప్పుడు కొబ్బరి నూనె పెడుతూ మసాజ్ చేసుకోవాలి. తల స్నానం చేసే ముందు కొద్ది సేపు నూనె పెట్టుకుని మర్ధన చేసుకున్న ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.