Hyderabad: హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్‌ పోర్న్‌ గ్యాంగ్‌.. నేరగాళ్ళ ఆటకట్టించిన సైబర్‌ టిప్‌ లైన్‌

హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి చైల్డ్‌ పోర్న్‌ వీడియోస్‌ని అప్‌లోడ్‌ చేస్తున్నట్టు సైబర్‌ టిప్‌ లైన్‌ గుర్తించడంతో హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతోన్న చైల్డ్‌పోర్న్‌ గ్యాంగ్‌ల గుట్టురట్టౌతోంది. త్వరలోనే వీరిపై కేసులు నమోదు..

Hyderabad: హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్‌ పోర్న్‌ గ్యాంగ్‌.. నేరగాళ్ళ ఆటకట్టించిన సైబర్‌ టిప్‌ లైన్‌
Police

పసిహృదయాలను చిదిమేస్తోన్న చైల్డ్‌ పోర్న్‌ నేరగాళ్ళ ఆటకట్టించే లక్ష్యంతో ఏర్పాటైన సైబర్‌ టిప్‌ లైన్‌ తెలంగాణలో మూడు చైల్డ్‌పోర్న్‌ కేసులను గుర్తించింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి చైల్డ్‌ పోర్న్‌ వీడియోస్‌ని అప్‌లోడ్‌ చేస్తున్నట్టు సైబర్‌ టిప్‌ లైన్‌ గుర్తించడంతో హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతోన్న చైల్డ్‌పోర్న్‌ గ్యాంగ్‌ల గుట్టురట్టౌతోంది. త్వరలోనే వీరిపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు హైదరాబాద్‌ పోలీసులు. గత కొన్నేళ్ళుగా చైల్డ్ పోర్న్ వీడియోస్ పై నిఘా పెట్టిన సైబర్ టిప్ లైన్ అప్‌లోడ్‌ చేసిన వీడియోస్ అధారంగా హైదరాబాద్ లో మూడు ఐపి అడ్రేస్ ల ద్వారా చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు అప్‌లోడ్‌ చేసినట్టు పసిగట్టింది. సైబర్‌ టిప్‌ లైన్‌ ఈ వివరాలను సీఐడీకి అందించడంతో హైదరాబాద్‌ పోలీస్‌ అప్రమత్తమయ్యారు.

సైబర్‌ టిప్‌లైన్‌ తెలంగాన సీఐడీకి అందించిన వివరాల ఆధారంగా, ఐపీ అడ్రస్‌ల ద్వారా నేరస్తులను గుర్తించారు పోలీసులు. రసూల్‌ పురా, టోలిచౌకి, వారాసి గూడా ప్రాంతాల నుంచి వీడియోస్‌ అప్‌లోడ్‌ చేసినట్టు ఐడెంటిఫై చేశారు హైదరాబాద్ పోలీసులు.

రసూల్‌ పురా, టోలిచౌకి, వారాసి గూడా ఏరియాల నుంచి 2017, 2019, 2020 లలో విడియోలు అప్లోడ్ చేశాయి ఈ చైల్డ్‌పోర్న్‌ ముఠాలు. త్వరలోనే వీరి పై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 2021 లో చైల్డ్ పోర్నోగ్రఫీ అప్‌ లోడర్స్ పై సీబీఐ రైడ్‌ చేసింది. 2021 లో హైదరాబాద్ లో చైల్డ్‌పోర్న్‌ వీడియోస్‌ అప్‌లోడ్‌ చేస్తోన్న 16 మందిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. అంతకు ముందు 2020 లో అప్‌లోడ్‌ చేసిన విడియోలను ఫార్వర్డ్ చేసిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు తాజా గా మరో మూడు కేసులను గుర్తించింది సైబర్‌ టిప్‌ లైన్‌.

నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్‌తో US సంస్థ చేసుకున్న ఒప్పందం ఫలితంగా చైల్డ్ పోర్నోగ్రఫీ విడియోలపై ఫిర్యాదు చేసేందుకు సెంట్రలైజ్డ్‌ రిపోర్టింగ్‌ సిస్టమ్‌ సైబర్ టిప్ లైన్ ఏర్పాటుచేశారు. రిపోర్ట్ ని NCRB ద్వారా మెట్రో నగరాలకు చేరవేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు.

తెలంగాణ వార్తల కోసం