IND Vs ENG 1st T20I Highlights: ఈ విజయం బౌలర్లదే - ఇంగ్లండ్పై మొదటి టీ20లో భారత్ విక్టరీ!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై టీమిండియా 50 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. చివర్లో తడబడ్డ టీమిండియాటాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన రోహిత్ శర్మను (24: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొయిన్ అలీ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (8: 10 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా (33: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (39: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా రాణించారు. అయితే వీరు ముగ్గురూ అవుటయ్యాక స్కోరు వేగం పూర్తిగా మందగించింది. దినేష్ కార్తీక్ (11: 7 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం కావడంతో పాటు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసుకోగా... రీస్ టాప్లే, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్‌లకు చెరో వికెట్ దక్కింది. అదరగొట్టిన బౌలర్లు199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భీకరమైన ఫాంలో ఉన్న కెప్టెన్, ఓపెనర్ జోస్ బట్లర్ (0: 1 బంతి) తాను ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. భువీ అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బట్లర్‌ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ భరతం పట్టే పని పాండ్యా తీసుకున్నాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో డేవిడ్ మలన్ (21: 14 బంతుల్లో, నాలుగు ఫోర్లు), లియాం లివింగ్ స్టోన్ (0: 3 బంతుల్లో), ఏడో ఓవర్లో జేసన్ రాయ్‌లను (4: 16 బంతుల్లో) పాండ్యా అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 33 పరుగులకే ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. హ్యారీ బ్రూక్ (28: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), మొయిన్ అలీ (36: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఇక్కడ చాహల్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. వీరిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన వారిలో క్రిస్ జోర్డాన్ (26: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా అది మ్యాచ్ గెలవడానికి ఏమాత్రం సరిపోలేదు. దీంతో ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా... అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. భువీ, హర్షల్ పటేల్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్పై టీమిండియా 50 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది.
చివర్లో తడబడ్డ టీమిండియా
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి వికెట్ను త్వరగానే కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన రోహిత్ శర్మను (24: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొయిన్ అలీ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (8: 10 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన దీపక్ హుడా (33: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (39: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా రాణించారు.
అయితే వీరు ముగ్గురూ అవుటయ్యాక స్కోరు వేగం పూర్తిగా మందగించింది. దినేష్ కార్తీక్ (11: 7 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం కావడంతో పాటు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసుకోగా... రీస్ టాప్లే, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్లకు చెరో వికెట్ దక్కింది.
అదరగొట్టిన బౌలర్లు
199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భీకరమైన ఫాంలో ఉన్న కెప్టెన్, ఓపెనర్ జోస్ బట్లర్ (0: 1 బంతి) తాను ఎదుర్కొన్న మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. భువీ అద్భుతమైన ఇన్స్వింగర్తో బట్లర్ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ భరతం పట్టే పని పాండ్యా తీసుకున్నాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో డేవిడ్ మలన్ (21: 14 బంతుల్లో, నాలుగు ఫోర్లు), లియాం లివింగ్ స్టోన్ (0: 3 బంతుల్లో), ఏడో ఓవర్లో జేసన్ రాయ్లను (4: 16 బంతుల్లో) పాండ్యా అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ 33 పరుగులకే ఇంగ్లండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది.
హ్యారీ బ్రూక్ (28: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), మొయిన్ అలీ (36: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్కు 61 పరుగులు జోడించారు. ఇక్కడ చాహల్ ఇంగ్లండ్కు షాక్ ఇచ్చాడు. వీరిద్దరినీ ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన వారిలో క్రిస్ జోర్డాన్ (26: 17 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా అది మ్యాచ్ గెలవడానికి ఏమాత్రం సరిపోలేదు. దీంతో ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా... అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. భువీ, హర్షల్ పటేల్లు చెరో వికెట్ పడగొట్టారు.