India vs England 3rd T20: క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన భారత్.. ఇంగ్లండ్‌తో మూడో టీ20.. పాక్ రికార్డ్ బ్రేక్ చేసేనా?
భారత జట్టు ఇప్పటివరకు నాటింగ్‌హామ్‌లో మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు గెలిచి ఒకదానిలో ఓడిపోయింది. అయితే ఇక్కడ ఇప్పటివరకు ఇంగ్లండ్‌తో భారత్ ఏ మ్యాచ్ కూడా ఆడలేదు.
గత నాలుగేళ్లలో స్వదేశంలో టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను రెండుసార్లు ఓడించి, ప్రపంచ తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. మూడో మ్యాచ్ నేడు నాటింగ్‌హామ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే స్వదేశంలో టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు ఇంగ్లండ్‌ను ఓడించిన జట్టుగా భారత జట్టు అవతరిస్తుంది. పాక్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం రోహిత్ అండ్ కోకు ఉంది.
పాకిస్థాన్, వెస్టిండీస్ టీంలతో కలిసి..
ఇంగ్లండ్‌ను స్వదేశంలో అత్యధిక సార్లు టీ20లో ఓడించిన విషయంలో భారత్ ప్రస్తుతం పాకిస్థాన్, వెస్టిండీస్‌లతో సమానంగా ఉంది. భారత్ తమ స్వదేశంలో ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌ను 4 సార్లు ఓడించింది. 7 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్ 4 విజయాలతోపాటు12 మ్యాచ్‌ల్లో తలపడిన వెస్టిండీస్ టీం కూడా 4 సార్లు విజయాలు సాధించాయి. మూడో టీ20 మ్యాచ్‌లో గెలిస్తే ఈ రెండు టీంలను భారత్ అధిగమిస్తుంది.
32 ఏళ్ల తర్వాత క్లీన్‌స్వీప్‌కు అవకాశం..
క్రికెట్లోని మూడు ఫార్మాట్ల గురించి మాట్లాడితే, 32 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌ను తమ స్వదేశంలో భారత్ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అంతకుముందు 1990లో అక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0తో ఓడిపోయింది. టీ20, టెస్టు సిరీస్‌లలో భారత్ ఎప్పుడూ క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది.
విరాట్ ఫామ్ పైనే డౌట్..
విరాట్ కోహ్లీ రెండవ T20లో ఫ్లాప్ అయ్యాడు. కేవలం 1 పరుగు చేసి ఔట్ అయ్యాడు. ఇదిలావుండగా మూడో మ్యాచ్‌లో అతనికి మళ్లీ అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే ప్రతిభ, అద్భుతమైన ఫామ్‌లో దూసుకుపోతున్న దీపక్ హుడా మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి రావచ్చు.
నాటింగ్‌హామ్‌లో భారత్ నాలుగో మ్యాచ్..
భారత జట్టు ఇప్పటివరకు నాటింగ్‌హామ్‌లో మూడు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు గెలిచి ఒకదానిలో ఓడిపోయింది. అయితే ఇక్కడ ఇప్పటివరకు ఇంగ్లండ్‌తో భారత్ ఏ మ్యాచ్ కూడా ఆడలేదు.
నాటింగ్‌హామ్‌లో 7 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు గెలిచింది. 2021లో పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 232 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇరు జట్ల అంచనా..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా మరియు యుజ్వేంద్ర చాహల్.
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్ (కెప్టెన్), డేవిడ్ మలన్, లియామ్ లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, రిచర్డ్ గ్లీసన్, మార్క్ పార్కిన్సన్.