Infinix Note 12 Series : రూ.15వేల లోపు ధరకే Infinix 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఇన్ఫినిక్స్ నుంచి కొత్త నోట్ 12 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. The post Infinix Note 12 Series : రూ.15వేల లోపు ధరకే Infinix 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్..! appeared first on 10TV.

Infinix Note 12 Series : రూ.15వేల లోపు ధరకే Infinix 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్..!

Infinix Note 12 And Note 12 Pro Launched In India, Price Starts At Rs 14,999

Infinix Note 12 Series : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఇన్ఫినిక్స్ నుంచి కొత్త నోట్ 12 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఇన్ఫినిక్స్ లైనప్‌లో Infinix Note 12 5G, Infinix Note 12 Pro 5G అనే రెండు డివైజ్‌లు ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు జూలై 15 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ధరల పరంగా చూస్తే.. Infinix Note 12 5G ధర రూ. 14,999 ఉండగా, Infinix Note 12 Pro 5G ధర రూ. 17,999గా నిర్ణయించింది. కంపెనీ ప్రారంభ ఆఫర్‌ కూడా ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్ల కింద యాక్సిస్ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు మాత్రమే రూ. 1500 వరకు తగ్గింపును అందిస్తుంది.

Infinix Note 12 And Note 12 Pro Launched In India, Price Starts At Rs 14,999 (1)

Infinix Note 12 And Note 12 Pro Launched In India

ఇన్ఫినిక్స్ నోట్ 12 స్పెసిఫికేషన్‌లు ఇవే :

Infinix Note 12 5G 6.7-అంగుళాల Full-HD+ AMOLED డిస్‌ప్లేతో 100 శాతం DCI P3 కలర్ గామట్‌కు సపోర్టు అందిస్తుంది. MediaTek Dimensity 810 5G చిప్‌సెట్‌తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB RAM నుంచి 9GB వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12-ఆధారిత XOS 10.6తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50-MP ప్రైమరీ లెన్స్, 2-MP అల్ట్రా-వైడ్ AI లెన్స్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16-MP కెమెరాను కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని అందిస్తుంది.

Infinix Note 12 And Note 12 Pro Launched In India, Price Starts At Rs 14,999 (2)

Infinix Note 12 And Note 12 Pro Launched In India, Price Starts At Rs 14,999 

Infinix Note 12 Pro 5Gలో 6.7-అంగుళాల Full-HD+ AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 810 5G చిప్‌సెట్, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్, 512GB వరకు పెంచుకోవచ్చు. 812GB వరకు స్టోరేజ్ అందిస్తుంది. 13GB వరకు పొడిగించుకోవచ్చు. సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత XOS 10.6 రన్ అవుతుంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. Infinix Note 12 5G 108-MP ప్రైమరీ కెమెరా, 2-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ AI లెన్స్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఫోన్‌లో 16-MP షూటర్ కూడా ఉంది.

Read Also : iPhone 14 : ఈ సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 14 లాంచ్.. ధర ఎంత ఉండొచ్చుంటే?

The post Infinix Note 12 Series : రూ.15వేల లోపు ధరకే Infinix 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్..! appeared first on 10TV.