iPhone : 10 నెలల క్రితం నదిలో పోయిన ఐఫోన్ దొరికింది.. వర్కింగ్ కండీషన్ చూస్తే షాక్..!
మీ ఫోన్ ఎక్కడైనా పోయిందనుకోండి. కొన్నాళ్ల తర్వాత ఆ ఫోన్ మళ్లీ మీకు దొరికితే ఎగిరి గంతేయాలనిపిస్తుంది కదా.. The post iPhone : 10 నెలల క్రితం నదిలో పోయిన ఐఫోన్ దొరికింది.. వర్కింగ్ కండీషన్ చూస్తే షాక్..! appeared first on 10TV.
iPhone Working : మీ ఫోన్ ఎక్కడైనా పోయిందనుకోండి. కొన్నాళ్ల తర్వాత ఆ ఫోన్ మళ్లీ మీకు దొరికితే ఎగిరి గంతేయాలనిపిస్తుంది కదా.. అయితే మీరు పొగట్టుకున్న ఆ ఫోన్ అదే కండీషన్లో ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేం. సాధారణంగా కొన్ని నెలల పాటు ఫోన్ వాడకుండా పడిస్తే అది పనిచేయకుండా పోతుంది. అందులోనూ నీళ్లలో ఫోన్ పడిస్తే అసలు పనికిరాకుండా పోతుంది. కానీ, ఆపిల్ ఐఫోన్ మాత్రం అలా కాదు.. దాదాపు 10 నెలల క్రితం నదిలో పడిపోయిన ఐఫోన్ ఇప్పుడు అదే వ్యక్తికి తిరిగి దొరికింది. ఇక్కడ నమ్మశక్యంగానీ విషయం ఏమిటంటే.. ఆ ఐఫోన్ మొత్తం బురదమయం అయినప్పటికీ ఇప్పటికీ గుడ్ కండీషన్లో ఉంది. యూకేకు చెందిన ఓ వ్యక్తి పది నెలల క్రితం తన ఐఫోన్‌ను నదిలో పొగట్టుకున్నాడు.
అది తిరిగి దొరుకుతుందనే ఆశతో అతను మళ్లీ నదిలోకి వెళ్లాడు. అదృష్టవశాత్తూ పొగట్టుకున్న అతడి ఐఫోన్ దొరికింది. ఓ నివేదిక ప్రకారం.. యూకేకు చెందిన ఓవైన్ డేవిస్ తన ఐఫోన్‌ను ఆగస్టు 2021లో బ్యాచిలర్ పార్టీ సందర్భంగా గ్లౌసెస్టర్షైర్ (UK)లోని సిండర్‌ఫోర్డ్ సమీపంలోని వై నదిలో పొగ్టుకున్నాడు. అప్పుడా ఐఫోన్ పై అతడు ఆశలు వదిలేసుకున్నాడు. నిరాశతో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. దాదాపు పది నెలల తర్వాత.. అదే నదిపై తన కుటుంబంతో కలిసి పడవలో ప్రయాణించిన మిగ్యుల్ పచేకో అనే వ్యక్తి డేవిస్ ఐఫోన్‌ను చూశాడు. వెంటనే నదిలో నుంచి ఐఫోన్ తీసుకున్నాడు. ఆ ఫోన్ మొత్తం బురదతో నిండి ఉంది. ఫోన్ క్లీన్ చేసి ఆరబెట్టిన తర్వాత ఆ ఫోన్ ఎవరిది తెలియదంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
ఆ ఫోన్ రిస్టార్ట్ కాదని తెలుసు. అందుకే ముందుగా ఫోన్ ఆరబెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ ఫోన్లో వ్యక్తిగత సెంటిమింట్ విషయాలు ఉండవచ్చని భావించాడు. తన ఫోన్ పోతే ఆ బాద ఏంటో తెలుసునని, తన పిల్లల ఫోటోలు చాలా ఉన్నాయని, అప్పుడు ఆ ఫోన్ తిరిగి కావాలి ఎవరికైనా అనిపిస్తుందని అతను చెప్పాడు. ఆ ఐఫోన్ క్లీన్ చేసి ఛార్జ్ చేసినప్పుడు.. అతడు నమ్మలేకపోయాడు. ఆ ఫోన్ ఎప్పటిలానే వర్క్ అవుతుంది. ఫోన్ ఛార్జింగ్ ఎక్కడంతో ఆశ్చర్యపోయాడు. స్విచ్ ఆన్ చేయగానే అతను ఆగస్ట్ 13 తేదీలో పురుషుడు, స్త్రీ స్క్రీన్సేవర్ను చూశాడు.
అది ఐఫోన్ నదిలో పడిపోయిన రోజు. పోగొట్టుకున్న ఐఫోన్ గురించి పచెకో పోస్ట్ ఫేస్బుక్లో 4వేల సార్లు షేర్ అయింది. అయితే డేవిస్ సోషల్ మీడియా అకౌంట్ లేదు. మరి అతడికి తన ఐఫోన్ గురించి ఎలా తెలుసునంటే.. అతని స్నేహితులు ఫోన్‌ని గుర్తించారు.. దాన్ని పచేకోతో కనెక్ట్ అయి డేవిస్‌కు సహాయం చేసారు. ఇటీవలి ఏళ్లల్లో లాంచ్ అయిన అన్ని ఐఫోన్లు దాదాపు IP68 రేట్ తోనే వస్తున్నాయి. ఈ ఐఫోన్లలో 1.5 మీటర్ల నీటిని కూడా 30 నిమిషాల పాటు లోపలికి వెళ్లకుండా కంట్రోల్ చేయగలవు. అయితే ఇలా అన్ని సార్లు జరగదని గుర్తించాలి.
Read Also : Apple iPhones : భారతీయుల ఐఫోన్లు 80శాతం ఛార్జింగ్‌తోనే ఆగిపోతున్నాయి.. అసలు కారణం ఇదే!
The post iPhone : 10 నెలల క్రితం నదిలో పోయిన ఐఫోన్ దొరికింది.. వర్కింగ్ కండీషన్ చూస్తే షాక్..! appeared first on 10TV.