Kaali: మరింత ముదురుతున్న కాళీ వివాదం.. మహువా మొయిత్రా వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఏమన్నారంటే

దేశంలో వివాదాస్పదమైన కాళీ (Kalee) అంశంపై పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Benerjee) స్పందించారు. తమ పార్టీకి చెందిన నేత మహువా మొయిత్ర చేసిన కామెంట్లపై దీదీ ఇంట్రస్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. పని చేసేప్పుడు తప్పులు...

Kaali: మరింత ముదురుతున్న కాళీ వివాదం.. మహువా మొయిత్రా వ్యాఖ్యలపై మమతా బెనర్జీ ఏమన్నారంటే
Mamata Banerjee

దేశంలో వివాదాస్పదమైన కాళీ (Kalee) అంశంపై పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamatha Benerjee) స్పందించారు. తమ పార్టీకి చెందిన నేత మహువా మొయిత్ర చేసిన కామెంట్లపై దీదీ ఇంట్రస్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. పని చేసేప్పుడు తప్పులు చేస్తుంటామని, వాటిని సరిదిద్దుకోవచ్చని అన్నారు. కొందరు మంచిని చూడకుండా కేవలం నెగటివిటీ వైపే ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. నెగిటివిటీ ఆలోచనలు మనల్ని దెబ్బతీస్తుందన్న మమతా బెనర్జీ.. సానుకూలంగా ఆలోచించాలని కోరారు. డైరెక్టర్ లీనా మణిమేకల దర్శకత్వం వహిస్తున్న కాళీ(Goddess Kali) డ్యాక్యూమెంటరీ పై వివాదం నెలకొంది. ఇటీవల ఈ డాక్యూమెంటరీ నుంచి కాళీ మాత పోస్టర్ విడుదల కావడంతో అందులో కాళీ చేతిలో సిగరెట్ ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. అమ్మవారి చేతిలో సిగరెట్ ఉండడం ఏంటీ అంటూ డైరెక్టర్ లీనా పై మండిపడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల డైరెక్టర్ లీనా పై కేసులు నమోదయ్యాయి. ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ వినిపిస్తున్నాయి.

తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా కూడా ఈ వివాదంలో ఇరుక్కున్నారు. కాళీ మాత మాంసాహారం తింటుంది.. మద్యం సేవిస్తుంది.. అంటూ మహువా చేసిన వ్యాఖ్యలపై రగడ కొనసాగుతోంది. మహువా మొయిత్రాను వెంటనే అరెస్ట్ చేయాలని కోల్‌కతాలో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో కూడా మహువా మొయిత్రాపై కేసు నమోదయ్యింది. త్వరలోనే భోపాల్‌ పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశముంది. ఎంపీ మహువా మొయిత్రా వ్యాఖ్యలతో సంబంధం లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.