Lalu Prasad Yadav: ఐసీయూలో లాలూ ప్రసాద్ యాదవ్.. ‘నాన్న మీరే నా హీరో’ అంటూ కుమార్తె రోహిణీ ఆచార్య ట్వీట్
Lalu Prasad Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె తన తండ్రి లాలూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో..
సోమవారంనాడు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె తన తండ్రి లాలూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య. ఇందులో లాలూ చాలా బలహీనంగా, అనారోగ్యంగా కనిపిస్తున్నారు. అయితే.. రెండురోజుల క్రితం మెట్లపైనుంచి జారిపడిన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వీపు భాగాన గాయమై భుజం విరగడంతో ఆయనకు పట్నాలోని పారస్ ఆసుపత్రిలో ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పలు అనారోగ్య కారణాలతో బాధపడుతూ కిడ్నీ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల భావోద్వేగానికి గురయ్యారు. ట్విటర్ వేదికగా ఆయన చిత్రాలను షేర్ చేస్తూ.. తండ్రే తన హీరో అంటూ తన ప్రేమను చాటుకున్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి (రోహిణి ఆచార్య) రెండు ఫోటోలను షేర్ చేశారు. ఇందులో, ఆమె మరియు మిసా భారతి వీడియో కాల్ ద్వారా తండ్రి లాలూ యాదవ్‌ను చూస్తున్నారు.. ఇందులో ఆమె భావోద్వేగంగా కనిపించారు.
‘నా హీరో.. నా బ్యాక్ బోన్.. త్వరగా కోలుకో నాన్న. ప్రతి అవరోధం నుంచి విముక్తి పొందిన ఆయన వెంట ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. వారి అభిమానమే ఆయన బలం’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న ఆమె వీడియో కాల్ ద్వారా తన తండ్రి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని రోహిణి ఆచార్య మీసా ఆకాక్షించారు.
My hero
My backbone Papa Read More