Lalu Prasad Yadav: విషమించిన లాలూ ఆరోగ్యం, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు
రాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో పట్నాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. The post Lalu Prasad Yadav: విషమించిన లాలూ ఆరోగ్యం, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు appeared first on 10TV.
Lalu Prasad Yadav: రాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో పట్నాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. పలు అనారోగ్యాల కారణంగా ఇబ్బంది పడుతున్న ఆయన తన నివాసంలోనే మెట్లపై నుంచి జారి పడటంతో కుడి భుజానికి గాయమైంది.
ఆదివారం ఎయిర్ అంబులెన్స్ లో పట్నా హాస్పిటల్ లో జాయిన్ చేయగా.. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డయాబెటిస్ తో పాటు రెనాల్, కార్డియాక్ సమస్యలు తీవ్రమవడంతో పెరుగుతుండటంతో మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తీసుకెళ్లారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. లాలూ ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, అది అతని హక్కు అని అన్నారు. అతను త్వరగా కోలుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.
Read Also: అవసరమైతే లాలూను చికిత్స కోసం సింగపూర్‌కు తీసుకెళ్తాం: తేజస్వీ యాదవ్
1970లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని ఉద్యమంలో నితీష్ కుమార్, లాలూ యాదవ్ చాలా కాలం పనిచేశారు. ప్రధాని మోదీ బుధవారం ఫోన్ చేసి లాలూ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
The post Lalu Prasad Yadav: విషమించిన లాలూ ఆరోగ్యం, ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు appeared first on 10TV.