Maharashtra: ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో 25 మంది బీజేపీ నేతలకు చోటు?
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కేబినెట్‌లోకి 25 మంది బీజేపీ నేతలు, 13 మంది ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతలను తీసుకుంటున్నట్లు తెలిసింది. The post Maharashtra: ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో 25 మంది బీజేపీ నేతలకు చోటు? appeared first on 10TV.
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే ప్రస్తుతం కేబినెట్ కూర్పుపై దృష్టి పెట్టారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. కేబినెట్‌లోకి 25 మంది బీజేపీ నేతలు, 13 మంది ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన నేతలను తీసుకుంటున్నట్లు తెలిసింది. కేబినెట్‌లో మొత్తం 38 మంది మంత్రులు ఉండనున్నారు.
Maharashtra: సీఎంగా తొలిసారి ఇంటికి ఏక్‌నాథ్ షిండే.. డ్రమ్స్ వాయించిన భార్య లత.. వీడియో
ముఖ్యమంత్రి పదవిని ఏక్‌నాథ్ షిండేకు ఇచ్చినప్పటికీ కేబినెట్‌లో బీజేపీ నేతలే అధికంగా ఉండనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఇటీవలే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కేబినెట్‌లో కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. తదుపరి మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికలకు ముందే మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
The post Maharashtra: ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో 25 మంది బీజేపీ నేతలకు చోటు? appeared first on 10TV.