Maharashtra: శివ‌సేన‌కు ఉద్ధ‌వ్ ఠాక్రేనే చీఫ్‌.. రెబ‌ల్ ఎమ్మెల్యేల గ్రూపున‌కు గుర్తింపులేదు: ఎంపీ సావంత్

శివసేన పార్టీ అధ్యక్షుడిగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే కొన‌సాగుతార‌ని ఆ పార్టీ మాజీ ఎంపీ అర‌వింద్ సావంత్ స్ప‌ష్టం చేశారు. దాదాపు 40 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు సీఎం ఏక్‌నాథ్ షిండే వ‌ర్గంలో ఉన్న విష‌యం తెలిసిందే. శివ‌సేన పార్టీ త‌మ‌దేన‌ని ఏక్‌నాథ్ వ‌ర్గం ఎమ్మెల్యేలు అంటున్నారు. The post Maharashtra: శివ‌సేన‌కు ఉద్ధ‌వ్ ఠాక్రేనే చీఫ్‌.. రెబ‌ల్ ఎమ్మెల్యేల గ్రూపున‌కు గుర్తింపులేదు: ఎంపీ సావంత్ appeared first on 10TV.

Maharashtra: శివ‌సేన‌కు ఉద్ధ‌వ్ ఠాక్రేనే చీఫ్‌.. రెబ‌ల్ ఎమ్మెల్యేల గ్రూపున‌కు గుర్తింపులేదు: ఎంపీ సావంత్

Sawanth

Maharashtra: శివసేన పార్టీ అధ్యక్షుడిగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే కొన‌సాగుతార‌ని ఆ పార్టీ మాజీ ఎంపీ అర‌వింద్ సావంత్ స్ప‌ష్టం చేశారు. దాదాపు 40 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు సీఎం ఏక్‌నాథ్ షిండే వ‌ర్గంలో ఉన్న విష‌యం తెలిసిందే. శివ‌సేన పార్టీ త‌మ‌దేన‌ని ఏక్‌నాథ్ వ‌ర్గం ఎమ్మెల్యేలు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంపై అర‌వింద్ సావంత్ నేడు మీడియాతో మాట్లాడుతూ… శివ‌సేన రాజ‌కీయ పార్టీ, శాస‌న‌స‌భా ప‌క్షం అనేవి రెండు వేర్వేరు అంశాల‌ని చెప్పారు.

Maharashtra: ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో 25 మంది బీజేపీ నేత‌ల‌కు చోటు?

రెబ‌ల్ ఎమ్మెల్యేల బృందానికి గుర్తింపు లేద‌ని అన్నారు. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్ళిపోయిన‌ప్ప‌టికీ ఉద్ధ‌వ్ ఠాక్రేనే శివ‌సేన అధ్య‌క్షుడిగా ఉంటార‌ని చెప్పారు. చ‌ట్టం ప్ర‌కారం శివ‌సేన శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌ను నియ‌మించ‌డానికి ఉద్ధ‌వ్ ఠాక్రేకు మాత్ర‌మే హ‌క్కు ఉంటుంద‌ని తెలిపారు. శివ‌సేన నుంచి ఠాక్రేను విడ‌దీయ‌లేర‌ని అన్నారు. కాగా, ఇప్ప‌టికే షిండే బీజేపీతో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు.

 

The post Maharashtra: శివ‌సేన‌కు ఉద్ధ‌వ్ ఠాక్రేనే చీఫ్‌.. రెబ‌ల్ ఎమ్మెల్యేల గ్రూపున‌కు గుర్తింపులేదు: ఎంపీ సావంత్ appeared first on 10TV.