Mahindra Scorpio-N: మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో-ఎన్.. కేవలం రూ.11.99లక్షలు మాత్రమే

ఇండియన్ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా నుంచి న్యూ జనరేషన్ స్కార్పియో లాంచ్ అయింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ధర కేవలం రూ.11.99లక్షలు ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది. The post Mahindra Scorpio-N: మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో-ఎన్.. కేవలం రూ.11.99లక్షలు మాత్రమే appeared first on 10TV.

Mahindra Scorpio-N: మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో-ఎన్.. కేవలం రూ.11.99లక్షలు మాత్రమే

Mahindra 1

Mahindra Scorpio-N: ఇండియన్ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా నుంచి న్యూ జనరేషన్ స్కార్పియో లాంచ్ అయింది. మహీంద్రా స్కార్పియో-ఎన్ పేరిట మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ ధర కేవలం రూ.11.99లక్షలు ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది. కాగా, ఈ మోడల్ కు సంబంధించి ఓపెనింగ్స్ 2022 జులై 30న మొదలవుతాయని, 4X4 వేరియంట్లలో జులై 21న రివీల్ చేస్తామని తెలిపారు.

మహీంద్రా స్కార్పియో-N ప్రారంభ-స్థాయి పెట్రోల్ MT Z2 వేరియంట్ ధర రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. స్కార్పియో-ఎన్ డీజిల్ ధర రూ.12.49 లక్షలు. టాప్-ఎండ్ మహీంద్రా స్కార్పియో-N డీజిల్ MT 4×2 Z8 L వేరియంట్ ధర రూ. 19.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).

మహీంద్రా స్కార్పియో-ఎన్‌ని పెట్రోల్, డీజిల్ రెండు వేరియంట్‌లలో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందిస్తుంది. ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్‌లు డీజిల్ పవర్‌ట్రెయిన్‌కు మాత్రమే పరిమితం చేస్తారు. మహీంద్రా స్కార్పియో-N డీజిల్ 2.2-లీటర్ టర్బోఛార్జ్‌డ్ ఇంజన్‌ను 175bhp మ్యాగ్జిమం పవర్, 400Nm గరిష్ట టార్క్‌తో రూపొందించారు. పెట్రోల్ వేరియంట్ 203bhp, 380Nm ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బోఛార్జ్‌డ్ మోటార్‌తో అమర్చారు.

Read Also: 4 సంవత్సరాల గరిష్టానికి చేరిన మహీంద్రా షేర్ ధర

2.0-litre పెట్రోల్ 6-speed MT (Z2, Z4, Z8 and Z8 L) – 203bhp, 370Nm
2.0-litre పెట్రోల్ 6-speed AT (Z2, Z4, Z8 and Z8 L) – 203bhp, 380Nm
2.2-litre డీజిల్ 6-speed MT (Z2 and Z4) – 132bhp, 300Nm
2.2-litre డీజిల్ 6-speed MT (Z6, Z8 and Z8 L) – 175bhp, 370Nm
2.2-litre డీజిల్ 6-speed AT (Z4, Z6, Z8 and Z8 L) – 175bhp, 400Nm

Mahindra

Mahindra

కంపెనీ వివరాల ప్రకారం.. Z2, Z4, Z6, Z7, Z8, Z8 Lఐదు చాయీస్ లను విడుదల చేస్తుంది. వీటిలో టాప్ ఎండ్ Z8 L మాత్రమే ఆరు లేదా ఏడు సీట్ల ఆప్షన్ ఉంటుంది. మిగిలిన వాటికి ఏడు సీట్లు స్టాండర్డ్ గా అమర్చి ఉంటాయి.

కొత్త మహీంద్రా స్కార్పియో-N 4,662mm పొడవు, 1,917mm వెడల్పు, 1,857mm ఎత్తుతో డిజైన్ చేశారు. ఇది 2,750ఎమ్ఎమ్ వీల్ బేస్ కలిగి ఉంది. SUV కొత్త ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించారు. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 57 లీటర్లు.

మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్ సందర్భంగా , M&M లిమిటెడ్, ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ వీజయ్ నక్రా మాట్లాడుతూ, “ఆల్-న్యూ స్కార్పియో-ఎన్ గేమ్-ఛేంజర్‌గా రూపొందించాం. దాని డిజైన్, అధునాతన రైడ్, హ్యాండ్లింగ్, థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్, లేటెస్ట్ టెక్నాలజీ, భరోసానిచ్చే భద్రత మహీంద్రా వారసత్వాన్ని ముందుకు తీసుకువెళుతుంది. ఇది గ్లోబల్ ప్రొడక్ట్. ఇండియాలో లాంచ్‌తో పాటు దక్షిణాఫ్రికా, నేపాల్‌లో ఏకకాలంలో లాంచింగ్ చేయనున్నారు. ఇతర అంతర్జాతీయ మార్కెట్‌లలోనూ త్వరలోనే లాంచ్‌ చేసే ఆలోచనలో ఉన్నారు.

The post Mahindra Scorpio-N: మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో-ఎన్.. కేవలం రూ.11.99లక్షలు మాత్రమే appeared first on 10TV.