Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!
ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ విండోస్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. కొన్ని నెలల తర్వాత మైక్రోసాఫ్ట్ Windows 8.1కి సపోర్టును నిలిపివేయనుంది. The post Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి! appeared first on 10TV.
Microsoft Alert : ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ విండోస్ యూజర్లను అలర్ట్ చేస్తోంది. కొన్ని నెలల తర్వాత మైక్రోసాఫ్ట్ Windows 8.1కి సపోర్టును నిలిపివేయనుంది. ఈ Windows 8.1 వెర్షన్‌ని ఉపయోగిస్తున్న యూజర్లు జనవరి 10, 2023 నుంచి కొత్త అప్డేట్లను అందుకోలేరని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
The Verge నివేదిక ప్రకారం.. ప్రస్తుత Windows 8.1 వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ రిమైండర్లను పంపుతోంది. జనవరి 10 తర్వాత, మీరు Microsoft 365ని రన్ చేస్తున్నట్టయితే.. ఇకపై Office యాప్‌లకు అప్డేట్లను అందుకోలేరని అంటోంది. అంతేకాదు.. అందులోని ఫీచర్లు, సెక్యూరిటీ, ఇతర క్వాలిటీ అప్డేట్స్ అని నిలిచిపోనున్నాయి.
Microsoft 365 ప్రోడక్ట్ అప్డేట్లను కొనసాగించాలంటే.. Windows 8 లేదా 8.1ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ కావాలని సిఫార్సు చేస్తోంది. ఈ మేరకు టెక్ దిగ్గజం తమ సపోర్టు పేజీలో పేర్కొంది. గతంలో జనవరి 12, 2016న Windows 8కి Microsoft సపోర్టు నిలిపివేసింది.
Windows 8.1 వినియోగదారులకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. ఈ వెర్షన్ సపోర్టు తేదీ ముగింపుకు చేరుకున్న తర్వాత Microsoft 365 యాప్‌లు సరిగ్గా పని చేయవని గుర్తించుకోవాలి. ఏదైనా పర్ఫార్మెన్స్ లేదా సెక్యూరిటీ పరమైన సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు Windows కొత్త వెర్షన్‌కు అప్ గ్రేడ్ కావాలని కంపెనీ వినియోగదారులకు సూచిస్తోంది.
Windows 8.1 వెర్షన్ వాడుతున్నారా? ఇలా Upgrade చేయండి :
– మీ PC ఔట్ డేటెడ్ విండోస్ వెర్షన్ వాడితే.. Windows 10కి అప్‌గ్రేడ్ చేయవచ్చు.
– Microsoft Windows 11ని కూడా పొందవచ్చు.
– చాలామంది Windows 8.1 లేదా Windows 8 సిస్టమ్స్ నుంచి Windows 11కి అప్‌గ్రేడ్ చేయడానికి హార్డ్‌వేర్ సపోర్టు తప్పనిసరి.
మీ కంప్యూటర్ లేటెస్ట్ వెర్షన్ కోసం సిస్టమ్ రిక్వర్మెంట్స్ అనుగుణంగా లేకపోతే.. మీరు Windows 10 OSని ఉపయోగించాల్సి ఉంటుంది. Windows 10కి 2025 వరకు మాత్రమే సపోర్టు ఉంటుందని గుర్తుంచుకోండి. Microsoft ఇకపై Windows 10కి ఫ్రీగా అప్‌గ్రేడ్‌ను అందించదు. Microsoft అధికారిక వెబ్సైట్ ప్రకారం.. లైసెన్స్ కావాలంటే.. రూ. 10,379 చెల్లించాలి. ఎవరైనా యూజర్ కొత్త కంప్యూటర్లో Windows 11 సపోర్టు చేసే PCని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ వెర్షన్ పనిచేస్తుంది.
Read Also : Windows 11 Update : విండోస్ 11 OS యూజర్లకు మైక్రోసాఫ్ట్ అలర్ట్.. తప్పక తెలుసుకోండి..!
The post Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి! appeared first on 10TV.