MM Keeravaani: ఆర్ఆర్ఆర్ ట్రోల్స్ పై కీరవాణి ట్వీట్.. ఆ తల్లి సంకల్పమే కనిపిస్తుందంటూ..

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి రికార్డుకెక్కింది ఆర్ఆర్ఆర్ మూవీ. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై నెట్టింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ట్రిపులార్‌ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఆస్కార్ విన్నర్‌ సౌండ్ ఇంజినీర్ రసూల్‌ పూకుట్టి సైతం ఆర్ఆర్ఆర్ మూవీ ఓ గే లవ్ స్టోరీ అంటూ ట్విట్టర్ ఖాతాలో అభ్యంతర కామెంట్స్ చేశారు. దీంతో అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్. రసూల్ కామెంట్స్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. గే లవ్ స్టోరీ అయితే తప్పేంటీ ? అంటూ తనదైన శైలీలో కౌంటరిచ్చారు నిర్మాత శోభు యార్లగడ్డ.మరోవైపు రసూల్ పూకుట్టి చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో అతడిని ఏకిపారేస్తున్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సైతం రసూల్ పూకుట్టి వాఖ్యలపై స్పందించారు. అప్పర్ కేసు, లోయర్ కేసు టైప్ చేయడంలో నేను చాలా బ్యాడ్.. కానీ ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేయడంలో తప్పు లేదు. అది రసూల్‌కి కూడా వర్తిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. అలాగే… ప్రస్తుతం నాకు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్, భీమ్ పాత్రలు కనిపించడం లేదు. కేవలం కిడ్నాప్ కు గురైన మల్లి కోసం జీవితాంతం ఎదురుచూసే తల్లి మాత్రమే కనిపిస్తుంది. నా కంటి చూపు ఇప్పుడు మెరుగయ్యింది అనుకుంటున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు కీరవాణి. ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం: Videos Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.! Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్.. Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

MM Keeravaani: ఆర్ఆర్ఆర్ ట్రోల్స్ పై కీరవాణి ట్వీట్.. ఆ తల్లి సంకల్పమే కనిపిస్తుందంటూ..
Mm Keeravani Tweet On Rrr Trolls


ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి రికార్డుకెక్కింది ఆర్ఆర్ఆర్ మూవీ. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమాపై నెట్టింట రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే ట్రిపులార్‌ సినిమా పై నెగిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఆస్కార్ విన్నర్‌ సౌండ్ ఇంజినీర్ రసూల్‌ పూకుట్టి సైతం ఆర్ఆర్ఆర్ మూవీ ఓ గే లవ్ స్టోరీ అంటూ ట్విట్టర్ ఖాతాలో అభ్యంతర కామెంట్స్ చేశారు. దీంతో అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్. రసూల్ కామెంట్స్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. గే లవ్ స్టోరీ అయితే తప్పేంటీ ? అంటూ తనదైన శైలీలో కౌంటరిచ్చారు నిర్మాత శోభు యార్లగడ్డ.మరోవైపు రసూల్ పూకుట్టి చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో అతడిని ఏకిపారేస్తున్నారు. తాజాగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సైతం రసూల్ పూకుట్టి వాఖ్యలపై స్పందించారు. అప్పర్ కేసు, లోయర్ కేసు టైప్ చేయడంలో నేను చాలా బ్యాడ్.. కానీ ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేయడంలో తప్పు లేదు. అది రసూల్‌కి కూడా వర్తిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. అలాగే… ప్రస్తుతం నాకు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్, భీమ్ పాత్రలు కనిపించడం లేదు. కేవలం కిడ్నాప్ కు గురైన మల్లి కోసం జీవితాంతం ఎదురుచూసే తల్లి మాత్రమే కనిపిస్తుంది. నా కంటి చూపు ఇప్పుడు మెరుగయ్యింది అనుకుంటున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు కీరవాణి. ఆయన చేసిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?