Motorola Moto G42: మోటోరోలా మోటో జీ42 జులై 11న మార్కెట్లోకి

అద్భుతమైన ఆఫర్లతో మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. Motorola త్వరలో రాబోయే Moto G42 జూలై 11నుంచి మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించింది మోటో సంస్థ. Flipkartలో అందుబాటులోకి రానుండగా.. స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,999 అని అనౌన్స్ చేశారు. The post Motorola Moto G42: మోటోరోలా మోటో జీ42 జులై 11న మార్కెట్లోకి appeared first on 10TV.

Motorola Moto G42: మోటోరోలా మోటో జీ42 జులై 11న మార్కెట్లోకి

Motorola

 

Motorola Moto G42: అద్భుతమైన ఆఫర్లతో మరో బడ్జెట్ ఫోన్ మార్కెట్లోకి రానుంది. Motorola త్వరలో రాబోయే Moto G42 జూలై 11నుంచి మార్కెట్లోకి రానున్నట్లు ప్రకటించింది మోటో సంస్థ. Flipkartలో అందుబాటులోకి రానుండగా.. స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,999 అని అనౌన్స్ చేశారు.

కొత్త Moto హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 680 చిప్‌సెట్, IP52 సర్టిఫికేషన్‌తో రానుంది. హ్యాండ్‌సెట్ 6.4-అంగుళాల AMOLED FHD డిస్‌ప్లేతో ఉంది. Android 12 OSతో పనిచేస్తుంది. Motorola కంపెనీ Moto G42ని సరికొత్త OS- Android 13తో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్‌తో అప్‌గ్రేడ్ అవుతుందని పేర్కొంది. హ్యాండ్‌సెట్ 4GB RAMతో 64GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే డిజైన్ చేశారు.

కెమెరా Moto G42 50MP ప్రైమరీ షూటర్, 8MP సెకండరీ షూటర్, మాక్రో ఫోటోగ్రఫీ కోసం మూడో కెమెరా 2MPతో సెటప్‌తో వస్తుంది. ముందు భాగంలో, హ్యాండ్‌సెట్ 16MP (f/2.2, 1.0μm) యూనిట్‌తో వస్తుంది.

Read Also : మోటోరోలా నుంచి కొత్త 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

ఫోన్ 20W “టర్బోపవర్” ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీతో డిజైన్ చేశారు. స్మార్ట్‌ఫోన్- Moto g42 జూలై 11 నుండి అమ్మకానికి ఆన్ లైన్ సైట్లలో Flipkart, దేశంలోని ప్రముఖ రిటైల్ స్టోర్‌లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. హ్యాండ్‌సెట్ రెండు (మెటాలిక్ రోజ్, అట్లాంటిక్ గ్రీన్) కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొనుగోలుపై రూ. 1,000 క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. రిలయన్స్ జియో కస్టమర్‌లు Zee5 వార్షిక సభ్యత్వంపై రూ. 569 తగ్గింపుతో పాటు రూ. 2,000 వరకు జియో రీఛార్జ్‌లను కూడా పొందవచ్చు.

The post Motorola Moto G42: మోటోరోలా మోటో జీ42 జులై 11న మార్కెట్లోకి appeared first on 10TV.