No Walls Hotel: రెండు వైపులా ల్యాంప్స్‌.. అంతేగా.. ‘చుక్కలు’ చూపించే హోటల్‌..!

ఆరుబయట పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం… గ్రాండ్‌ పేరెంట్స్‌తో కథలు చెప్పించుకోవడం… 80ల్లోని పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం. అలా ముచ్చట్లతోనే నిద్రలోకి జారుకునేవాళ్లు. ఇప్పుడు అట్లాంటి ఆరుబయట పడుకునే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్‌. దాని పేరు నల్‌ స్టెర్న్‌ హోటల్‌. దీని ప్రత్యేకత ఏంటంటే… ఒక ప్లాట్‌ఫామ్‌ మీద డబుల్‌ కాట్‌ బెడ్, అటూఇటూ ల్యాంప్స్‌.అంతే.. గోడలు ఉండవు. తలు పులు ఉండవు. పైకప్పు అసలే లేదు. ఏకాంతం, రక్షణ కలిగించే ఏ సదు పాయమూ ఉండదు. హోటలియర్‌ డానియేల్‌ కార్బొనియెర్‌ రూపొందించిన ఈ ప్రాజెక్టు ఆలోచన స్విస్‌ ఆర్టిస్టులు ఫ్రాంక్‌ రిక్లిన్, పాట్రిక్‌ రిక్లిన్‌ బ్రదర్స్‌ది. ఇక్కడ స్టే చేస్తే.. ‘రాత్రంతా నిద్ర పట్టలేదు…’, ‘ఏం చప్పుళ్లురా బాబోయ్‌’ అనే ఫిర్యాదులు రావొచ్చు. కానీ ఆ ఆలోచన కల్పించేందుకే దీన్ని తయారు చేశామంటున్నారు రిక్లిన్‌ బ్రదర్స్‌.ఇక హోటల్‌లో ఒక నైట్‌ స్టే చేయాలంటే.. దాదాపు 27 వేల రూపాయలు చెల్లించాలి. డ్రింక్స్, బ్రేక్‌ఫాస్ట్‌ అన్నీ అక్కడికే తెచ్చిస్తారు. జూలై 1 నుంచి సెప్టెంబర్‌ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి సైలన్‌ గ్రామంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ పక్కన, ఇంకోటి వైన్‌యార్డ్‌లో, మరోదాన్ని కొండ పక్కన ఏర్పాటు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.! Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్.. Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

No Walls Hotel: రెండు వైపులా ల్యాంప్స్‌.. అంతేగా.. ‘చుక్కలు’ చూపించే హోటల్‌..!
Hotel With No Walls Video Goes Viral


ఆరుబయట పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం… గ్రాండ్‌ పేరెంట్స్‌తో కథలు చెప్పించుకోవడం… 80ల్లోని పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం. అలా ముచ్చట్లతోనే నిద్రలోకి జారుకునేవాళ్లు. ఇప్పుడు అట్లాంటి ఆరుబయట పడుకునే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్‌. దాని పేరు నల్‌ స్టెర్న్‌ హోటల్‌. దీని ప్రత్యేకత ఏంటంటే… ఒక ప్లాట్‌ఫామ్‌ మీద డబుల్‌ కాట్‌ బెడ్, అటూఇటూ ల్యాంప్స్‌.అంతే.. గోడలు ఉండవు. తలు పులు ఉండవు. పైకప్పు అసలే లేదు. ఏకాంతం, రక్షణ కలిగించే ఏ సదు పాయమూ ఉండదు. హోటలియర్‌ డానియేల్‌ కార్బొనియెర్‌ రూపొందించిన ఈ ప్రాజెక్టు ఆలోచన స్విస్‌ ఆర్టిస్టులు ఫ్రాంక్‌ రిక్లిన్, పాట్రిక్‌ రిక్లిన్‌ బ్రదర్స్‌ది. ఇక్కడ స్టే చేస్తే.. ‘రాత్రంతా నిద్ర పట్టలేదు…’, ‘ఏం చప్పుళ్లురా బాబోయ్‌’ అనే ఫిర్యాదులు రావొచ్చు. కానీ ఆ ఆలోచన కల్పించేందుకే దీన్ని తయారు చేశామంటున్నారు రిక్లిన్‌ బ్రదర్స్‌.ఇక హోటల్‌లో ఒక నైట్‌ స్టే చేయాలంటే.. దాదాపు 27 వేల రూపాయలు చెల్లించాలి. డ్రింక్స్, బ్రేక్‌ఫాస్ట్‌ అన్నీ అక్కడికే తెచ్చిస్తారు. జూలై 1 నుంచి సెప్టెంబర్‌ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి సైలన్‌ గ్రామంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ పక్కన, ఇంకోటి వైన్‌యార్డ్‌లో, మరోదాన్ని కొండ పక్కన ఏర్పాటు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Car – ambulance: అంబులెన్స్‌తో రేస్‌ పెట్టుకుని కారు డ్రైవర్‌.. సీన్‌ కట్‌ చేస్తే షాకింగ్‌ ఘటన.!

Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?