Nokia G11 Plus : పవర్‌ఫుల్ బ్యాటరీతో నోకియా G11 ఫోన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజులు వస్తుంది..!

ప్రముఖ హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే.. Nokia G11 Plus ఫోన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. The post Nokia G11 Plus : పవర్‌ఫుల్ బ్యాటరీతో నోకియా G11 ఫోన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజులు వస్తుంది..! appeared first on 10TV.

Nokia G11 Plus : పవర్‌ఫుల్ బ్యాటరీతో నోకియా G11 ఫోన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజులు వస్తుంది..!

Nokia G11 Plus With Three Day Battery Life Promise Launched

Nokia G11 Plus : ప్రముఖ హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అదే.. నోకియా G11 ఫోన్.. ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ఈ ఫోన్ రెండు ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ అందించనుంది. అంతేకాదు.. అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో రానుంది. ఒకసారి చార్జింగ్ పెడితే.. మూడు రోజుల బ్యాటరీ లైఫ్ బ్యాకప్‌ను అందిస్తుంది. యూజర్లు మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా పొందవచ్చు. అలాగే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది.

ధర ఎంతంటే? : 
నోకియా అంతర్జాతీయ వెబ్‌సైట్‌లో Nokia 11 స్మార్ట్‌ఫోన్‌ లిస్టు చేసింది. దీని ధర భారత మార్కెట్లో ఎంత ఉంటుంది అనేది క్లారిటీ లేదు. ఈ ఫోన్‌లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. చార్‌కోల్ గ్రే లేక్ బ్లూ కలర్స్. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌ను మాత్రమే పొందవచ్చు. ఈ ఫోన్ నోకియా G11 కన్నా ఖరీదైనదిగా చెబుతారు. ఫిబ్రవరిలో AED 499 వద్ద లాంచ్ అయింది. దీని ధర దాదాపు రూ. 10,700గా ఉంటుంది.

Nokia G11 Plus With Three Day Battery Life Promise Launched (1)

Nokia G11 Plus With Three Day Battery Life Promise Launched

నోకియా స్పెసిఫికేషన్స్ ఇవే :
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. నోకియా G11 ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్‌, 6.51-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. Nokia G11 Plus Nokia ఫోన్ ప్రాసెసర్ అందిస్తోంది. ఈ ఫోన్ 4GB RAM 64GB స్టోరేజీతో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్‌తో 512GB వరకు పెంచుకోవచ్చు. Nokia G11 Plus 50-MP ప్రైమరీ సెన్సార్, 2-MP సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. కెమెరా మాడ్యూల్‌లో LED ఫ్లాష్ కూడా ఉంది.

సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం.. 8-MP సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ప్రామాణిక కనెక్టివిటీ ఆప్షన్లతో వచ్చింది. 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS/ A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ ఉంది. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. Nokia G11 Plus 8.55mm, 192 గ్రాముల బరువు ఉంటుంది.

Read Also : Nokia G21 smartphone: భారత్ లో జీ21 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన నోకియా, మరో రెండు చిన్న ఫోన్లు కూడా

The post Nokia G11 Plus : పవర్‌ఫుల్ బ్యాటరీతో నోకియా G11 ఫోన్.. ఒకసారి ఛార్జ్ చేస్తే.. 3 రోజులు వస్తుంది..! appeared first on 10TV.