OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 10T సిరీస్ నుంచి 5G ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో వచ్చే జూలైలో లాంచ్ కానుంది. The post OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే? appeared first on 10TV.

OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

Oneplus 10t 5g Tipped To Launch Soon Specs, Price And Details We Know So Far (1)

OnePlus 10T 5G : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 10T సిరీస్ నుంచి 5G ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ భారత్ సహా గ్లోబల్ మార్కెట్లో వచ్చే జూలైలో లాంచ్ కానుంది. అంతకంటే ముందే వన్ ప్లస్ 10T సిరీస్ ఫోన్ ఫీచర్లు, ధరకు సంబంధించి డేటా లీక్ అయింది. లీక్ డేటా ప్రకారం.. OnePlus మార్చిలో భారత్ మార్కెట్లో OnePlus 10 ప్రోని లాంచ్ చేసింది. ఆ తర్వాత OnePlus 10T 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని వన్‌ప్లస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. T-స్మార్ట్‌ఫోన్ సిరీస్ సాధారణంగా ఏడాది చివరిలో రిజర్వ్ అవుతుంది. లీక్ ప్రకారం.. ముందే జూలైలో ప్రపంచవ్యాప్తంగా వన్ ప్లస్ 10T 5G లాంచ్ కానుంది. అతి త్వరలో మూడు OnePlus 10 సిరీస్ ఫోన్లు OnePlus 10 Pro, OnePlus 10R, OnePlus 10T లాంచ్ కానున్నాయి.

OnePlus 10T డిజైన్, స్పెసిఫికేషన్లు (అంచనా) :
అధికారిక ప్రకటనకు ముందు.. OnePlus 10T డిజైన్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీక్ అయింది. OnePlus 10 Proలో కెమెరా మాడ్యూల్‌ను గమనించవచ్చు. కంపెనీ ఈ వెర్షన్‌లో 10 ప్రో మోడల్‌ల మాదిరిగానే హాసెల్‌బ్లాడ్ కెమెరాలను తీసుకురానుంది. గతంలో OnePlus ఫోన్లలో ఐకానిక్ స్లయిడర్ బటన్‌ను అందిస్తుందో లేదో క్లారిటీ లేదు. లీకైన డేలాలో వన్ ప్లస్ 10T 5G ఫోన్ బ్లాక్ కలర్ ఆప్షన్లో ఉంది. అయితే ఈ ఫోన్ మరిన్ని కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులోకి రావొచ్చు.

డిస్‌ప్లే విషయానికి వస్తే.. 32MP సెల్ఫీ కెమెరాను ఎగువ భాగంలో సెంట్రల్‌గా ఉన్న పంచ్-హోల్‌తో 6.7-అంగుళాల 120Hz FHD+ AMOLED డిస్‌ప్లేను చూడవచ్చు. ఫ్రంట్ కెమెరా పూర్తి-HD వీడియో రికార్డింగ్‌కు మాత్రమే సపోర్టు ఇస్తుంది. చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇదే ఉంది. త్వరలో అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. OnePlus 10 Pro ఫోన్ కూడా 1080p వీడియో రికార్డింగ్ సామర్ధ్యంతో 32-MP ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. కానీ, ఈ ఫోన్ 16-MP ఫ్రంట్ కెమెరాతో రానుంది. OnePlus 10Rలో మాదిరిగా స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ Gen 1 SoC ప్రాసెసర్‌తో రానుందని నివేదిక తెలిపింది.

Oneplus 10t 5g Tipped To Launch Soon Specs, Price And Details We Know So Far

Oneplus 10t 5g Tipped To Launch Soon Specs, Price And Details We Know So Far

ఈ ఫోన్ డైమెన్సిటీ 9000 SoCని కలిగి ఉంటుందని మరో నివేదిక సూచిస్తోంది. OnePlus సాధారణంగా ఫ్లాగ్‌షిప్ Qualcomm ప్రాసెసర్‌లతో వస్తుంది. అయితే OnePlus 10T సరసమైన ధరకే రానుంది. ఎందుకంటే.. ఈ ఫోన్ Snapdragon 8 Plus Gen 1 SoCతో రానుందని తెలుస్తోంది. ఛార్జింగ్ విషయానికి వస్తే.. 10T వైర్‌లెస్ ఛార్జింగ్‌ వస్తుందో లేదో చూడాలి. OnePlus 10 Proలో 10Rలో డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ ఫోన్‌కు IP రేటింగ్ లభిస్తుందో లేదో తెలియాల్సి ఉంది. లీక్ ప్రకారం.. ఈ ఫోన్ పెద్ద 4,800mAh బ్యాటరీతో రానుంది. 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ సపోర్టును కలిగి ఉండనుంది.

OnePlus 10T ధర  (అంచనా) :
IT హోమ్ నివేదిక ప్రకారం.. OnePlus 10T 5G చైనాలో CNY 3,000 CNY 4,000 (దాదాపు రూ. 35,000 రూ. 47,000) మధ్య లాంచ్ కానుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ రూ. 50వేల లోపు ధరకే లాంచ్ కానుంది. OnePlus 10R 5G ప్రారంభ ధర రూ. 38,999.. అయితే OnePlus 10 Pro రూ. 66,999కి అందుబాటులో ఉంది.

Read Also : OnePlus Nord 2T : వన్‌ప్లస్ నార్డ్ 2T ఫోన్ వస్తోంది.. జూలై 1నే లాంచ్..!

The post OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే? appeared first on 10TV.