Patharchatta Plant Benefits: 100 వ్యాధులకు ఔషధం ఈ ఆకు.. దీనిని పెంచడానికి విత్తనం అవసరం లేదు

ఈ మొక్క ఆకులు రుచిలో పుల్లని, ఉప్పగా ఉంటాయి. మీరు ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. ఆకులో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి.

Patharchatta Plant Benefits: 100 వ్యాధులకు ఔషధం ఈ ఆకు.. దీనిని పెంచడానికి విత్తనం అవసరం లేదు
Patharchatta Plant

Patharchatta Plant Benefits: ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచంలో దేనికదే చాలా ప్రత్యేకమైనది. అందరినీ ఆశ్చర్యపరిచే ఎన్నో విషయాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా చెట్లు, మొక్కల్లో చాలా జాతులు వింత లక్షణాలను కలిగి ఉంటాయి. వీటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ఈ  రోజు మనం అలాంటి ఓ మొక్క గురించి తెలుసుకోబోతున్నాం. ఒక మొక్కను పెంచాలంటే విత్తనం లేదా ఆ మొక్కను కాండం వంటివి అవసరం అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనం ఓ చెట్టును పెంచుకోవడానికి ఎటువంటి విత్తనం, కాండం అవసరం లేదు.. అటు వంటి  మొక్క గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం.. ఒక్క ఆకు తో వేలాది ఆకులు పెరుగుతాయి. కనుక ఇది చాలా ప్రత్యేకమైనది.

ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం Kalanchoe Pinnata Plant, కానీ దీనిని స్థానిక భాషలో స్టోన్‌క్రాప్ లేదా వండర్ ప్లాంట్ అని పిలుస్తారు. ఆయుర్వేద దృక్కోణంలో చూస్తే ఈ మొక్క మీకు ఆరోగ్య బీమాగా భావిస్తారు. ఈ మొక్క ద్వారా మీరు వ్యాధులపై ఖర్చు చేసే డబ్బును ఆదా చేయవచ్చు. దీనిలో అనేక ఔషధ గుణాలతో నిండి ఉండడం వల్ల అనేక పేర్లతో పిలుస్తారు. ఎయిర్ ప్లాంట్, కేథడ్రల్ బెల్స్, లైఫ్ ప్లాంట్, మ్యాజిక్ లీఫ్ మొదలైనవి.

ఈ మొక్క ఆకులు రుచిలో పుల్లని, ఉప్పగా ఉంటాయి. మీరు ఏ సీజన్‌లోనైనా తినవచ్చు. ఆకులో ఉండే ఆరోగ్యకరమైన లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ల నుంచి చర్మ సంబంధిత సమస్యలైన ఎగ్జిమా, దద్దుర్లు వంటి వ్యాధులను దూరం చేయడంలో ఈ మొక్క ఎంతగానో సహకరిస్తుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow