Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేనాని విమర్శలు.. నవరత్నాల అమలుపై నవ సందేహాలు అంటూ..

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ వైసీపీ ఎన్నికల హామీల అమలుపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు పై నవ సందేహాలు అంటూ ఓ పోస్ట్ చేశారు.

Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేనాని విమర్శలు.. నవరత్నాల అమలుపై నవ సందేహాలు అంటూ..
Pawan Vs Jagan

Pawan Kalyan: ఏపీలో ఎన్నికలకు ముందే పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నువ్వానేనా అన్నట్లు సాగుతుంది. ఓ వైపు ఏపీ సీఎం జగన్.. బహిరంగ సభలో ప్రతి పక్షాలపై.. నేతల తీరుపై విరుచుకుపడుతున్నారు.. మరోవైపు జనసేన అధినేత.. వివిధ కార్యక్రమాలు చేపట్టి.. ప్రభుత్వపని తీరుని విమర్శిస్తున్నారు.. తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ వైసీపీ ఎన్నికల హామీల అమలుపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలు పై నవ సందేహాలు అంటూ ఓ పోస్ట్ చేశారు.

మొదటి రత్నం రైతు భరోసా: 64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?.. అయితే గత మూడళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700 మందికి మాత్రమే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా? అని ప్రశ్నించారు పవన్.

రెండో రత్నం అమ్మ ఒడి: అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ తీరుని ప్రశ్నించారు.

మూడో రత్నం పెన్షన్లు: ఏపీలో పెన్షనర్ల జాబితాను కుదించడమే కాదు.. సుమారు 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా? అన్నారు

నాలుగో రత్నం సంపూర్ణ మద్యపాన నిషేధం: ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని హామీనిచ్చారు. మరి మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు.. 2021-22లో రూ.22 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరుకుంది. మరి ఇదేనా మధ్య  మద్యపాన నిషేధం అన్నారు. అంతేకాదు మద్యం ఆదాయం చూపించే 8వేల కోట్ల బాండ్లు అమ్మలేదా అంటున్నారు జనసేనాని.

అయిదో రత్నం జల యజ్ఞం: పోలవరం ప్రాజెక్టును ‘యుద్ధ ప్రాతిపదిక’ ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?

ఆరో రత్నం ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సి.ఎమ్.ఆర్.ఎఫ్. నుంచి వైద్యం జర్దులు ఎందుకు చెల్లించడం లేదన్నారు పవన్.

ఏదో రత్నం ఫీజు రీయింబర్స్మెంట్: విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు? ఫీజు రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపిస్తున్న మాట నిజం కాదా?

ఎనిమిదో రత్నం పేదలందరికీ ఇళ్ళు:  చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? మరి ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదన్నారు పవన్.

తొమ్మిదో రత్నం ఆసరా: పొదుపు సంఘాల సంఖ్యను ఏటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయంటూ జనసేనాని ఏపీ ప్రభుత్వాన్ని నవ రత్నాల పనితీరుపై సూటిగా ప్రశ్నించారు. మరి ఏపీ మంత్రులు, నేతలు పవన్ ప్రశ్నలకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..