Punjab: నిరాడంబరంగా జరిగిన సీఎం భగవంత్ మాన్ పెళ్లి.. కుటుంబంతో కేజ్రీవాల్ హాజరు
గుర్‌ప్రీత్ కౌర్ అనే డాక్టర్‌ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇవాళ పెళ్లి చేసుకున్నారు. పంజాబ్‌లోని చండీగఢ్ సెక్టార్ 8 లోని గురుద్వారాలో నిరాడంబరంగా ఆయన వివాహం జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆయన వివాహానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. The post Punjab: నిరాడంబరంగా జరిగిన సీఎం భగవంత్ మాన్ పెళ్లి.. కుటుంబంతో కేజ్రీవాల్ హాజరు appeared first on 10TV.
Punjab: గుర్‌ప్రీత్ కౌర్ అనే డాక్టర్‌ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇవాళ పెళ్లి చేసుకున్నారు. పంజాబ్‌లోని చండీగఢ్ సెక్టార్ 8 లోని గురుద్వారాలో నిరాడంబరంగా ఆయన వివాహం జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఆయన వివాహానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అలాగే, పంజాబ్ ఆప్ ఎంపీలు, పలువురు నేతలు కూడా హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Maharashtra: ఏక్‌నాథ్ షిండే కేబినెట్‌లో 25 మంది బీజేపీ నేతలకు చోటు?
ఆరేళ్ళ క్రితం భగవంత్ మాన్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో అమెరికాలో భగవంత్ మాన్ మాజీ భార్య ఉంటున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఆ కార్యక్రమానికి ఇద్దరు పిల్లలు హాజరయ్యారు. కాగా, గుర్‌ప్రీత్ కౌర్ (32) కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతానికి చెందిన వారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో భగవంత్ మాన్‌కు గుర్‌ప్రీత్ తనవంతు సాయం చేశారు.
The post Punjab: నిరాడంబరంగా జరిగిన సీఎం భగవంత్ మాన్ పెళ్లి.. కుటుంబంతో కేజ్రీవాల్ హాజరు appeared first on 10TV.