Restaurant Service Charge : రెస్టారెంట్లో ఫుడ్ బిల్లుపై సర్వీసు ఛార్జ్ వేస్తే.. వెంటనే ఫిర్యాదు చేయండిలా..!

హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్‌కు సంబంధించి నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్లు ఉల్లంఘనకు సంబంధించి వినియోగదారులు తమ ఫిర్యాదులు చేయవచ్చు. The post Restaurant Service Charge : రెస్టారెంట్లో ఫుడ్ బిల్లుపై సర్వీసు ఛార్జ్ వేస్తే.. వెంటనే ఫిర్యాదు చేయండిలా..! appeared first on 10TV.

Restaurant Service Charge : రెస్టారెంట్లో ఫుడ్ బిల్లుపై సర్వీసు ఛార్జ్ వేస్తే.. వెంటనే ఫిర్యాదు చేయండిలా..!

Here’s How To Lodge Complaint If Restaurant Adds Service Charge To Bill (1)

Restaurant Service Charge : సరదాగా ఫ్యామిలీ లేదా స్నేహితులతో కలిసి రెస్టారెంట్లు, హోటల్స్ సర్వీసు ఛార్జీల పేరుతో చుక్కలు చూపిస్తున్నాయి. తిన్నదానికి బిల్లు చెల్లించాల్సిందిబోయి.. దానికి తోడు సర్వీసు ఛార్జీలను భారీగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో ఏ హోటల్, రెస్టారెంట్లకు వెళ్లినా అక్కడ ఆటోమాటిక్‌గా సర్వీసు ఛార్జీలను విధిస్తున్నారు. ఫుడ్ బిల్లులపై డిపాల్ట్‌గా సర్వీసు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. దాంతో హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్‌కు సంబంధించి నేషనల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కీలక నిర్ణయం తీసుకుంది. హోటల్‌ లేదా రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు ఆటోమేటిక్‌గా సర్వీస్‌ ఛార్జీలు విధించడం లేదా ఫుడ్‌ బిల్లులపై డిఫాల్ట్‌గా వసూలు చేయడాన్ని నిషేధిస్తూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) ఇటీవల మార్గదర్శకాలను జారీ చేసింది. సర్వీస్ ఛార్జీలు చెల్లించమని ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కస్టమర్‌లను బలవంతం చేయలేమని పేర్కొంది. అయితే, కస్టమర్ తనకు కావాలంటే సర్వీస్ ఛార్జీలు చెల్లించవచ్చు. పూర్తిగా స్వచ్ఛందంగా వినియోగదారుని అభీష్టానుసారం మాత్రమే..

మార్గదర్శకాల ప్రకారం..
హోటళ్లు, రెస్టారెంట్లు ఉల్లంఘనకు సంబంధించి వినియోగదారులు తమ ఫిర్యాదులు చేయవచ్చు. ఒక రెస్టారెంట్ సర్వీస్ ఛార్జ్ విధించడాన్ని వినియోగదారు చూసినట్లయితే వెంటనే రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లవచ్చు. అందుకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. ముందుగా.. బిల్లుపై వేసిన సర్వీస్ ఛార్జీని తీసివేయమని హోటల్ లేదా రెస్టారెంట్‌లోని సిబ్బందిని అభ్యర్థించవచ్చు. కస్టమర్‌లు తమ నంబర్ 1915 లేదా NCH మొబైల్ యాప్‌కి కాల్ చేయవచ్చు.

Here’s How To Lodge Complaint If Restaurant Adds Service Charge To Bill

Here’s How To Lodge Complaint If Restaurant Adds Service Charge To Bill

నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)లో ఫిర్యాదు చేయవచ్చు. మూడవది.. వినియోగదారుడు వినియోగదారుల కమిషన్‌కు లేదా ఆన్‌లైన్‌లో edaakhil పోర్టల్ ద్వారా edaakhil.nic.inలో ఫిర్యాదు చేయవచ్చు. కస్టమర్ NCH మొబైల్ యాప్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. నాల్గవది.. CCPA ద్వారా విచారణ జరపవచ్చు. తదుపరి చర్యల కోసం కస్టమర్ సంబంధిత జిల్లా, జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదును సమర్పించవచ్చు. [email protected]కి ఈ-మెయిల్ పంపడం ద్వారా వినియోగదారు నేరుగా CCPAకి ఫిర్యాదు చేయవచ్చు.

సర్వీసు ఛార్జ్ అంటే.. 

సాధారణంగా ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసినప్పుడు లేదా ఏదైనా సేవను పొందినప్పుడు వినియోగదారులు కొంత ఛార్జీ చెల్లించవలసి ఉంటుంది. దీనినే సర్వీస్ ఛార్జ్ అని పిలుస్తారు. హోటల్‌లు లేదా రెస్టారెంట్‌లలో కస్టమర్‌లకు ఆహారం లేదా మరేదైనా సర్వీసులను అందించినందుకు ఛార్జీ విధిస్తున్నారు. CCPA దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీస్ ఛార్జ్‌ అనేది బిల్లు కింద ఉంటుంది. సాధారణంగా సర్వీసు ఛార్జ్ అంటే 5 శాతం వరకు విధిస్తారు. కానీ, కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో CCPA ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

Read Also : EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం

The post Restaurant Service Charge : రెస్టారెంట్లో ఫుడ్ బిల్లుపై సర్వీసు ఛార్జ్ వేస్తే.. వెంటనే ఫిర్యాదు చేయండిలా..! appeared first on 10TV.