S Jaishankar: భారత విద్యార్థుల్ని అనుమతించండి.. చైనా మంత్రిని కోరిన భారత్

గురువారం ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో బాలిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు. భారత్-చైనా మధ్య సంబంధాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. The post S Jaishankar: భారత విద్యార్థుల్ని అనుమతించండి.. చైనా మంత్రిని కోరిన భారత్ appeared first on 10TV.

S Jaishankar: భారత విద్యార్థుల్ని అనుమతించండి.. చైనా మంత్రిని కోరిన భారత్

S Jaishankar

S Jaishankar: కోవిడ్ కారణంగా చైనా నుంచి భారత్ తిరిగొచ్చిన విద్యార్థుల్ని తిరిగి చైనాలోకి అనుమతించాలని కోరారు భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ఎస్.జైశంకర్. గురువారం ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో బాలిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక అంశాలపై చర్చించారు.

TTD: తిరుమలలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం .. రేపు సెప్టెంబర్ వసతి కోటా టిక్కెట్ల విడుదల

భారత్-చైనా మధ్య సంబంధాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయన్నారు. పరస్పర సున్నితత్వం, పరస్సర అవసరాలు, గౌరవంపై ఆధారపడి ఉన్నాయని జై శంకర్ అన్నారు. తూర్పు లదాఖ్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఏసీ) వద్ద నెలకొన్న వివాదాన్ని కూడా త్వరగా పరిష్కరించుకోవాలని ఈ చర్చల సందర్భంగా కోరారు. సరిహద్దు సమస్యతోపాటు ఇరు దేశాల మధ్య నెలకొన్న అనేక సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్చలు జరిగినట్లు జై శంకర్ చెప్పారు. చైనా నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థుల్ని త్వరగా చైనాలోకి తిరిగి అనుమతించాలని, విద్యా సంస్థలకు హాజరయ్యేలా చూడాలని వాంగ్ యిని కోరారు.

Uddhav Thackeray: ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే క్యాంపులో చేరిన థానె కార్పొరేటర్లు

చైనా నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థులు చైనా అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు టిబెటన్ మత గురువు దలైలామా పుట్టిన రోజున ప్రధాని ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మరుసటి రోజే చైనాతో భారత్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

The post S Jaishankar: భారత విద్యార్థుల్ని అనుమతించండి.. చైనా మంత్రిని కోరిన భారత్ appeared first on 10TV.