Shinzo Abe Shot Dead: షింజో అబేపై కాల్పులు జరిపిన వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అతని చేతికి గన్ ఎలా వచ్చింది?

అబేను ఎందుకు హత్య చేశారు..?  జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురి కావటం మొత్తం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన అబే, ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మంచి అడ్మినిస్ట్రేటర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావటం, ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో అనుమానితుడైన తెత్సుయా యమగమిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పొలిటికల్ క్యాంపెయిన్‌కు వచ్చిన షింజోని తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి తెత్సుయానే అని భావిస్తున్నారు. గన్‌ కల్చర్‌పై చాలా స్ట్రిక్ట్‌ రూల్స్‌ని అమలు చేస్తున్న జపాన్‌లో ఇలాంటి ఘటన జరగటాన్ని భద్రతా అధికారులు సహించలేకపోతున్నారు. ఎగువ సభ ఎన్నికల ప్రచారంలో హత్యకు గురి కావటం వల్ల ఇది ఎవరు చేయించి ఉంటారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కస్టడీలో ఉన్న తెత్సుయా గురించే అంతటా చర్చ జరుగుతోంది. అసలు ఎవరీ వ్యక్తి..? షింజో అబేను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఎవరైనా చెబితే, ఈ పని చేశాడా..? లేదా కావాలనే తానే హత్య చేశాడా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.  ఎవరీ షూటర్..?  ప్రాథమిక సమాచారం ప్రకారం...ఈ షూటర్ పేరు తెత్సుయా యమగమి. షింజో అబే కుప్ప కూలిన వెంటనే ఈ షూటర్‌పై పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. గ్రే కలర్ టీషర్ట్ వేసుకున్న ఆ షూటర్‌ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్పులు జరిపిన తరవాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించకపోవటం ఇంకో ట్విస్ట్. డబుల్ బ్యారెల్డ్‌ గన్‌ను షూటర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ తుపాకీని షూటర్‌ స్వయంగా తయారు చేసుకున్నాడట. గతంలో నేవీ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో మూడేళ్ల పాటు తెత్సుయా పని చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జపాన్‌లోని ఎన్‌హెచ్‌కే మీడియా వెల్లడించింది.  తుపాకీ ఎలా వచ్చింది..? అసలు ఎందుకు హత్య చేశావని అడిగితే, షింజో అబే తీరుపై తనకు ఎప్పటి నుంచో అసంతృప్తి ఉందని, అందుకే చంపాలనుకున్నానని సమాధానం చెప్పినట్టు సమాచారం. నిజానికి జపాన్‌లో తుపాకీ పట్టుకుని వీధుల్లో ఇంత స్వేచ్ఛగా తిరగటమే సంచలనమవుతోంది. అసలు తుపాకీ కొనుగోలు చేయటం అక్కడ అంత సులువైన విషయం కాదు. గన్‌ను ఎలా వాడాలో తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలి, క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు. మానసికంగానూ స్టేబుల్‌గా ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉంటే, ఎంతో వెరిఫికేషన్ చేసుకుని అప్పడు కానీ తుపాకీ వినియోగానికి పోలీసులు అనుమతించరు. కానీ, ఇంత సింపుల్‌గా గన్ పట్టుకుని వచ్చి మాజీ ప్రధానిపైనే కాల్పులు జరపటమే అర్థం కాని విషయం. ఇది తేల్చేందుకే పోలీసులు స్థానికులనూ ప్రశ్నిస్తున్నారు.   

Shinzo Abe Shot Dead: షింజో అబేపై కాల్పులు జరిపిన వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అతని చేతికి గన్ ఎలా వచ్చింది?

అబేను ఎందుకు హత్య చేశారు..? 

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురి కావటం మొత్తం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన అబే, ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మంచి అడ్మినిస్ట్రేటర్‌గానూ పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి హత్యకు గురికావటం, ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో అనుమానితుడైన తెత్సుయా యమగమిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ పొలిటికల్ క్యాంపెయిన్‌కు వచ్చిన షింజోని తుపాకీతో కాల్చి చంపిన వ్యక్తి తెత్సుయానే అని భావిస్తున్నారు. గన్‌ కల్చర్‌పై చాలా స్ట్రిక్ట్‌ రూల్స్‌ని అమలు చేస్తున్న జపాన్‌లో ఇలాంటి ఘటన జరగటాన్ని భద్రతా అధికారులు సహించలేకపోతున్నారు. ఎగువ సభ ఎన్నికల ప్రచారంలో హత్యకు గురి కావటం వల్ల ఇది ఎవరు చేయించి ఉంటారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కస్టడీలో ఉన్న తెత్సుయా గురించే అంతటా చర్చ జరుగుతోంది. అసలు ఎవరీ వ్యక్తి..? షింజో అబేను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఎవరైనా చెబితే, ఈ పని చేశాడా..? లేదా కావాలనే తానే హత్య చేశాడా..? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. 

ఎవరీ షూటర్..? 

ప్రాథమిక సమాచారం ప్రకారం...ఈ షూటర్ పేరు తెత్సుయా యమగమి. షింజో అబే కుప్ప కూలిన వెంటనే ఈ షూటర్‌పై పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. ఎటూ కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. గ్రే కలర్ టీషర్ట్ వేసుకున్న ఆ షూటర్‌ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్పులు జరిపిన తరవాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించకపోవటం ఇంకో ట్విస్ట్. డబుల్ బ్యారెల్డ్‌ గన్‌ను షూటర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ తుపాకీని షూటర్‌ స్వయంగా తయారు చేసుకున్నాడట. గతంలో నేవీ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో మూడేళ్ల పాటు తెత్సుయా పని చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జపాన్‌లోని ఎన్‌హెచ్‌కే మీడియా వెల్లడించింది. 

తుపాకీ ఎలా వచ్చింది..?

అసలు ఎందుకు హత్య చేశావని అడిగితే, షింజో అబే తీరుపై తనకు ఎప్పటి నుంచో అసంతృప్తి ఉందని, అందుకే చంపాలనుకున్నానని సమాధానం చెప్పినట్టు సమాచారం. నిజానికి జపాన్‌లో తుపాకీ పట్టుకుని వీధుల్లో ఇంత స్వేచ్ఛగా తిరగటమే సంచలనమవుతోంది. అసలు తుపాకీ కొనుగోలు చేయటం అక్కడ అంత సులువైన విషయం కాదు. గన్‌ను ఎలా వాడాలో తప్పనిసరిగా శిక్షణ తీసుకోవాలి, క్రిమినల్ రికార్డ్ ఉండకూడదు. మానసికంగానూ స్టేబుల్‌గా ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉంటే, ఎంతో వెరిఫికేషన్ చేసుకుని అప్పడు కానీ తుపాకీ వినియోగానికి పోలీసులు అనుమతించరు. కానీ, ఇంత సింపుల్‌గా గన్ పట్టుకుని వచ్చి మాజీ ప్రధానిపైనే కాల్పులు జరపటమే అర్థం కాని విషయం. ఇది తేల్చేందుకే పోలీసులు స్థానికులనూ ప్రశ్నిస్తున్నారు.