Sourav Ganguly Turns 50: అంతర్జాతీయ క్రికెట్లో 'దాదా గిరి' కనిపించిన 5 బెస్ట్ సీన్స్!
Sourav Ganguly Turns 50: దూకుడు నేర్పిన నాయకుడు! మొక్కవోని ఆత్మవిశ్వాసం నేర్పిన యోధుడు! ప్రత్యర్థి బలవంతుడైనా తలొంచక ఢీకొట్టడం నేర్పిన వీరుడు! ఆటగాళ్లకు మిత్రుడు! అవతలి వారు కవ్విస్తే నువ్వెంత అంటే నువ్వెంత అనే సైనికుడు! మొత్తంగా ఇండియన్‌ క్రికెట్‌కు దాదాగిరి నేర్పిన సేవకుడు! అతడే సౌరవ్‌ గంగూలీ! టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ శుక్రవారం 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. క్రికెటర్‌గా తిరుగులేని రికార్డులు సృష్టించి దాదా కెరీర్లో ఎన్నో మధురస్మృతులు! అందులో ఎప్పటికీ మర్చిపోలేని ఐదు సంఘటనలు మీకోసం!! అరంగేట్రం అదుర్స్‌ సౌరవ్‌ గంగూలీ అరంగేట్రం అంత సులభంగా జరగలేదు. రొటేషన్ పద్ధతిలో ఛాన్సులు దొరకని అతడు 1996లో ఇంగ్లాండ్‌పై టెస్టు సిరీసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచులోనే 131 పరుగులతో దుమ్మురేపాడు. లార్డ్స్‌లో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాతి మ్యాచులోనూ సెంచరీ చేసిన దాదా 3 వికెట్లూ పడగొట్టాడు. గంగూలీకి మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ దక్కింది. ఆస్ట్రేలియాపై డామినేషన్‌ 1990-2000 కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా ఓ ప్రబల శక్తిగా మారింది. అన్ని దేశాలను డామినేట్‌ చేసింది. ఆటే కాదు నోటి దురుసునూ ప్రదర్శించేది. అప్పటికే 16 టెస్టులను వరుసగా గెలిచిన ఆసీస్‌ను దాదా సేనే నిలువరించింది. 2001 బోర్డర్‌ గావస్కర్‌ సిరీసును టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. కోల్‌కతాలో జరిగిన టెస్టులో వీవీఎస్‌ లక్ష్మణ్, రాహుల్‌ ద్రవిడ్‌, హర్భజన్ సింగ్‌ అద్భుతం చేశారు. సిరీసుకు ముందు భజ్జీ కోసం సెలక్టర్లతో పోరాడాడు. ఆటగాళ్ల టాలెంట్‌ను వెలికితీయడంలో తనకు సాటిలేదని నిరూపించాడు. లార్డ్స్‌ బాల్కనీలో సీన్‌! ఎవరెన్ని సాధించినా భారత క్రికెట్లో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన 2002 నాట్‌వెస్ట్ సిరీసులో జరిగింది! ఆ ఫైనల్లో 326 పరుగుల టార్గెట్‌ను ఇండియా ఛేదించింది. గంగూలీ, సెహ్వాగ్‌ కలిసి 87 బంతుల్లోనే 106 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం అందించారు. దాదా 43 బంతుల్లోనే 60 బాదేశాడు. యువీ, కైఫ్ విజయం అందించగానే లార్డ్స్‌ బాల్కనీలో దాదా చొక్కా విప్పి గిరగిరా తిప్పాడు. ఈ మూమెంట్‌ ఒక అమేజింగ్‌ థింగ్‌! ప్రపంచకప్‌ సెమీస్‌లో సెంచరీ టీమ్‌ఇండియా 1983లో తొలి ప్రపంచకప్‌ గెలిచింది. ఆ తర్వాత 2003లోనే ఫైనల్‌ చేరుకుంది. ఇందుకు సెమీస్‌లో కెన్యాతో తలపడాల్సి వచ్చింది. కీలకమైన ఈ మ్యాచులో దాదా 114 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 20 ఏళ్ల తర్వాత భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆఖరిలో సిరీసులో శతకం ఆస్ట్రేలియాతో 2008 టెస్టు సిరీసే తన కెరీర్లో చివరిదని గంగూలీ ప్రకటించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టాడు. కొత్త కెప్టెన్‌ ఎంఎస్ ధోనీతో కలిసి 109 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఆ మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 469 పరుగులు చేయగా.. మ్యాచును 320 తేడాతో సొంతం చేసుకుంది. నాలుగు మ్యాచుల సిరీసును 2-0తో కైవసం చేసుకుంది.
Sourav Ganguly Turns 50: దూకుడు నేర్పిన నాయకుడు! మొక్కవోని ఆత్మవిశ్వాసం నేర్పిన యోధుడు! ప్రత్యర్థి బలవంతుడైనా తలొంచక ఢీకొట్టడం నేర్పిన వీరుడు! ఆటగాళ్లకు మిత్రుడు! అవతలి వారు కవ్విస్తే నువ్వెంత అంటే నువ్వెంత అనే సైనికుడు! మొత్తంగా ఇండియన్ క్రికెట్కు దాదాగిరి నేర్పిన సేవకుడు! అతడే సౌరవ్ గంగూలీ!
టీమ్ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. క్రికెటర్గా తిరుగులేని రికార్డులు సృష్టించి దాదా కెరీర్లో ఎన్నో మధురస్మృతులు! అందులో ఎప్పటికీ మర్చిపోలేని ఐదు సంఘటనలు మీకోసం!!
అరంగేట్రం అదుర్స్
సౌరవ్ గంగూలీ అరంగేట్రం అంత సులభంగా జరగలేదు. రొటేషన్ పద్ధతిలో ఛాన్సులు దొరకని అతడు 1996లో ఇంగ్లాండ్పై టెస్టు సిరీసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచులోనే 131 పరుగులతో దుమ్మురేపాడు. లార్డ్స్లో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాతి మ్యాచులోనూ సెంచరీ చేసిన దాదా 3 వికెట్లూ పడగొట్టాడు. గంగూలీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.
ఆస్ట్రేలియాపై డామినేషన్
1990-2000 కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా ఓ ప్రబల శక్తిగా మారింది. అన్ని దేశాలను డామినేట్ చేసింది. ఆటే కాదు నోటి దురుసునూ ప్రదర్శించేది. అప్పటికే 16 టెస్టులను వరుసగా గెలిచిన ఆసీస్ను దాదా సేనే నిలువరించింది. 2001 బోర్డర్ గావస్కర్ సిరీసును టీమ్ఇండియా కైవసం చేసుకుంది. కోల్కతాలో జరిగిన టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, హర్భజన్ సింగ్ అద్భుతం చేశారు. సిరీసుకు ముందు భజ్జీ కోసం సెలక్టర్లతో పోరాడాడు. ఆటగాళ్ల టాలెంట్ను వెలికితీయడంలో తనకు సాటిలేదని నిరూపించాడు.
లార్డ్స్ బాల్కనీలో సీన్!
ఎవరెన్ని సాధించినా భారత క్రికెట్లో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన 2002 నాట్వెస్ట్ సిరీసులో జరిగింది! ఆ ఫైనల్లో 326 పరుగుల టార్గెట్ను ఇండియా ఛేదించింది. గంగూలీ, సెహ్వాగ్ కలిసి 87 బంతుల్లోనే 106 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించారు. దాదా 43 బంతుల్లోనే 60 బాదేశాడు. యువీ, కైఫ్ విజయం అందించగానే లార్డ్స్ బాల్కనీలో దాదా చొక్కా విప్పి గిరగిరా తిప్పాడు. ఈ మూమెంట్ ఒక అమేజింగ్ థింగ్!
ప్రపంచకప్ సెమీస్లో సెంచరీ
టీమ్ఇండియా 1983లో తొలి ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత 2003లోనే ఫైనల్ చేరుకుంది. ఇందుకు సెమీస్లో కెన్యాతో తలపడాల్సి వచ్చింది. కీలకమైన ఈ మ్యాచులో దాదా 114 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. 20 ఏళ్ల తర్వాత భారత్ను ఫైనల్కు చేర్చాడు.
ఆఖరిలో సిరీసులో శతకం
ఆస్ట్రేలియాతో 2008 టెస్టు సిరీసే తన కెరీర్లో చివరిదని గంగూలీ ప్రకటించాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు. కొత్త కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి 109 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఆ మ్యాచు తొలి ఇన్నింగ్స్లో భారత్ 469 పరుగులు చేయగా.. మ్యాచును 320 తేడాతో సొంతం చేసుకుంది. నాలుగు మ్యాచుల సిరీసును 2-0తో కైవసం చేసుకుంది.