Telangana: జోరు వానలోనూ షర్మిల దీక్ష.. టీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టుకు డిమాండ్

టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపడుతున్న పాదయాత్ర సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కొనసాగుతోంది. ప్రభుత్వ పాలనను నిరసిస్తూ హుజూర్‌నగర్ మండలంలోని లక్కవరంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు....

Telangana: జోరు వానలోనూ షర్మిల దీక్ష.. టీఆర్ఎస్ కార్యకర్తల అరెస్టుకు డిమాండ్
Sharmila

టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపడుతున్న పాదయాత్ర సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కొనసాగుతోంది. ప్రభుత్వ పాలనను నిరసిస్తూ హుజూర్‌నగర్ మండలంలోని లక్కవరంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. షర్మిల (YS.Sharmila) నిరసనను స్థానిక టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పార్టీ కార్యకర్తలు తోసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ లీడర్ ఏపూరి సోమన్నపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల జోరువానలోనూ నిరసన దీక్ష చేపట్టారు. అరెస్టు చేసే వరకు దీక్ష విరమించేది లేదంటూ జోరువానలో నిరసన కొనసాగిస్తున్నారు. కాగా.. దీక్ష విరమించాలని పోలీసులు కోరినా ఆమె పట్టించుకోకుండా నిరసన కొనసాగించడం గమనార్హం.

టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవాలని చెప్తున్నప్పటికీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సోమన్నపై దాడి చేసిన వారిని మేము గుర్తించాం. ఈ విషయాన్ని పోలీసులకూ చెప్పాం. అయినా వారు పట్టించుకోవడం లేదు. ఈ దాడికి సూత్రధారి మఠంపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు. అతణ్ని ఇంతవరకు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు. దాడి చేసిన వారిని అరెస్టు చేసేంత వరకు ఈ గ్రామం నుంచి కదలను.

   – వైఎస్. వైటీపీ అధ్యక్షురాలు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి