Telangana: వణిస్తున్న వీధి కుక్కలు.. నడివీధుల్లో తిరుగుతూ.. దొరికిన వాళ్లను దొరినట్లు

నిజామాబాద్‌ ( Nizamabad) జిల్లాలో వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. పట్టపగలే నడి వీధుల్లో తిరుగుతూ స్వైరవిహారం చేస్తున్నాయి. దొరికినవాళ్లను దొరికినట్టు కరిచేస్తూ ఆస్పత్రికి పంపేస్తున్నాయి.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ...

Telangana: వణిస్తున్న వీధి కుక్కలు.. నడివీధుల్లో తిరుగుతూ.. దొరికిన వాళ్లను దొరినట్లు
Street Dogs In Nizamabad

నిజామాబాద్‌ ( Nizamabad) జిల్లాలో వీధి కుక్కలు హల్ చల్ చేస్తున్నాయి. పట్టపగలే నడి వీధుల్లో తిరుగుతూ స్వైరవిహారం చేస్తున్నాయి. దొరికినవాళ్లను దొరికినట్టు కరిచేస్తూ ఆస్పత్రికి పంపేస్తున్నాయి.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ హడలెత్తిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరిపై ప్రతాపం చూపిస్తు్న్నాయి. పసిపిల్లలపై ఎటాక్‌ చేస్తూ పేరెంట్స్ కు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయ్‌. ఎడవల్లి మండల కేంద్రంలో స్ట్రీట్ డాగ్స్ 8 మంది పిల్లలపై దాడి చేశాయి. దొరికినవాళ్లను దొరికినట్లు కరిచేశాయ్‌. చిన్నారులకు గాయాలు కావడంతో వారిని వైద్య చికిత్స కోసం ఎడవల్లి పీహెచ్‌సీకి తరలించి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. ఎడవల్లి, వడ్డేపల్లి గ్రామాల్లో వీధి కుక్కలు డేంజర్ గా మారుతున్నాయి. వీధుల్లో విహరిస్తూ విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు కుక్కల స్వైరవిహారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని భయపడుతున్నారు. గ్రామాల్లో తిరుగుతున్న కుక్కుల భయంతో పిల్లలు ఆరుబయట ఆడుకునేందుకూ వణికిపోతున్నారు.

పెద్దవాళ్లదీ అదే పరిస్థితి.. ఇంట్లో నుంచి బయటకు రావడానికి, పనులకు వెళ్లడానికి భయపడుతున్నారు. పిల్లలు ఇంట్లో నుంచి బయటికు రాకుండా కాచుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా కుక్కల స్వైరవిహారానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు. రోడ్లపై విచ్చలవిడిగా కుక్కలు తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్క కాటుకు మరికొందరు పిల్లలు బలికాకముందే వాటిని పట్టుకుని తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, మరికొందరు కుక్కల బారిన పడటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.