Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కంపార్టమెంట్లలో నిండిన భక్తులు.. దర్శనానికి 40 గంటల సమయం..

కంపార్ట్మెంట్ లో భక్తులు భారీ సంఖ్యలో శ్రీ వెంటకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. తమకు 40 గంటలైనా స్వామి వారి దర్శనం అంద లేదని భక్తులు వాపోతున్నారు.

Tirumala Rush: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కంపార్టమెంట్లలో నిండిన భక్తులు.. దర్శనానికి 40 గంటల సమయం..
Tirumala Rush

Tirumala Rush: తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఓ వైపు వీకెండ్. మరోవైపు తొలిఏకాదశి (Toli Ekadashi )రావడంతో… హిందువుల ప్రముఖ ఫుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి భక్తులతో కిటకిటలాడుతోంది. కలియుగదైవం శ్రీ వేంకటనాథుడిని దర్శించుకునేందుకుతమ మొక్కులను చెల్లించుకోవడానికి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని భక్తులతో పాటు.. దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.  ఈ నేపథ్యంలో భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం కోసం గంటల తరబడి భక్తులు క్యూ లైన్ లో ఎదురు చూస్తున్నారు.

కంపార్ట్మెంట్ లో భక్తులు భారీ సంఖ్యలో శ్రీ వెంటకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. తమకు 40 గంటలైనా స్వామి వారి దర్శనం అంద లేదని భక్తులు వాపోతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టమెంట్లు భక్తులతో నిండిపోయాయి. అంతేకాదు తిరుమల గిరులు భక్తులతో కలకాలాడుతున్నాయి. తిరుమల కొండ నిండా భక్తులు నిండిపోయారు. మరోవైపు వసతి దొరక్క భక్తుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..