Traffic Rules : ట్రాఫిక్ రూల్స్‘బ్రేక్’ చేయటానికి కారణాలు ఇవట..! తెలిసింది కదా..పోలీసు బాబూలు ఇక చూస్కోండీ..

"ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత మీరు ట్రాఫిక్ పోలీసులకు చెప్పిన చమత్కారమైన సాకులు ఏంటి?" అని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా అడిగారు. దానికి ఇంకేమంది నెటిజన్లు కూడా వీర లెవెల్లో స్పందించి పుంఖాను పుంఖాలుగా సమాధానాలు చెప్పేశారు. వాటిలో కొన్ని కారణాలు చదివి పోలీసులు తెగ నవ్వుకున్నారట. The post Traffic Rules : ట్రాఫిక్ రూల్స్‘బ్రేక్’ చేయటానికి కారణాలు ఇవట..! తెలిసింది కదా..పోలీసు బాబూలు ఇక చూస్కోండీ.. appeared first on 10TV.

Traffic Rules : ట్రాఫిక్ రూల్స్‘బ్రేక్’ చేయటానికి కారణాలు ఇవట..! తెలిసింది కదా..పోలీసు బాబూలు ఇక చూస్కోండీ..

Traffic Rules

Traffic Rules : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయటం అనేది పరిపాటిగా మారిపోయింది. దానికి కారణాలు ఎన్నో ఉంటాయి. అవేంటో తెలుసుకోవాలని పోలీసులు ట్విట్టర్ వేదికగా అడుగగా నెటిజన్లు ఇచ్చిన సమాధానాలకు పోలీసులు నవ్వకుండా ఉండలేకపోయారట ఢిల్లీ పోలీసులు. ఇంతకీ ఢిల్లీ పోలీసులకు నెటిజన్లు చెప్పిన సమాధానలేంటో తెలిస్తే మనం కూడా నవ్వుకోవాల్సిందే..

సాధారణంగా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తూ పోలీసులకు దొరికితే..సార్ సార్ తప్పైంది సార్ ఇంకెప్పుడు చేయను అంటూ ఏదో బతిమాలుకుని తప్పించుకుంటాం. హెల్మెట్ ఏదీ? లైసెన్స్ ఏదీ? బండి డాక్యుమెంట్ ఏవీ చూపించండీ అని అడిగితే వాహనదారుడు ‘‘సార్ సార్..ఈ ఒక్కసారి వదిలేయండి సార్..ఇంకోసారి ఇవేవీ లేకండా బయటకు అడుగే పెట్టను ఒట్టు సార్ అంటూ ప్రాధేయపడి తప్పించుకున్న సందర్భాలు కూడా ఉండకపోవు. కానీ కొంతమంది కొంటెరాయుళ్లు మాత్రం నోటికొచ్చిన అబద్ధాలన్ని చెప్పేస్తుంటారు తప్పించుకోవటానికి. భలే భలే క్రియేటివ్‌గా సాకులు చెప్పి పోలీసులను సైతం బురిటీ కొట్టించేస్తుంటారు. పోలీసులు కూడా నమ్మరుగానీ..ఒక్కోసారి పోనిలే అని వదిలేస్తుంటారు. కానీ అదే అదనుగా చేసుకుని పదే పదే నాటకాలు ఆడితే మాత్రం కచ్చితంగా దొరకకా మానరు..ఫైన్ కట్టకా మానని సందర్భం ఎదురుకాకమానదు.

ఇదిలా ఉంటే..తాజాగా ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్విట్టర్ హ్యాండిల్ ఇలాంటి సాకుల గురించే నెటిజన్లను అడిగింది. “ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత మీరు ట్రాఫిక్ పోలీసులకు చెప్పిన చమత్కారమైన సాకులు ఏంటి?” అని ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా అడిగారు. దానికి ఇంకేమంది నెటిజన్లు కూడా వీర లెవెల్లో స్పందించి పుంఖాను పుంఖాలుగా సమాధానాలు చెప్పేశారు. వాటిలో కొన్ని కారణాలు చదివి పోలీసులు తెగ నవ్వుకున్నారట. పోలీసుల ట్విట్టర్ ద్వారా అడిగినదానికి నెటిజన్లు ఈ ట్వీట్ కింద తాము తెలివిగా, చమత్కారంగా చెప్పిన సాకులేంటో తెలియజేస్తూ అందరి చేత నవ్వులు పూయిస్తున్నారు.

ఒక నెటిజన్ “నా లవర్ వెయిట్ చేస్తుంది అన్న టైమ్ కు వెళ్లకపోతే నాకు బ్రేకప్ చెబుతుంది”అని చెప్పినా ప్రతిసారీ పోలీసులు జరిమానా విధించకుండా జాగ్రత్తగా పో, బాబూ అని పంపించారట. మరొకరేమో “నేను గర్భవతిని అందుకే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు” అని అబద్ధాలు చెప్పారట. ఇంకో యూజర్ ‘‘నా లైసెన్స్ కార్డును కుక్క తినేసింది సార్’’అని చెప్పానని తెలపటంతో పోలీసులు తెగ నవ్వుకున్నారట.

ఇంకొక యూజర్ “సార్..ఇది నా మొదటి సారి, మళ్లీ జరగదు” అని చెబితే వదిలేశారట. మరొక యూజర్ “హెల్మెట్ లేకుండా మేం ఒకరోజు పోలీసులకు రెడ్ హ్యండెడ్‌గా దొరికాం..దాంతో బండి మీద కూర్చున్న మాలోని ఒకరు సార్, మేం స్టూడెంట్స్ మా దగ్గర డబ్బుల్లేవు‘అని చెప్పారు” అలా ఇంకొరు సినిమాల్లో చెప్పినట్లుగానే హెల్మెట్ లేకుండా పట్టుబడగా…సార్ సార్..మా అమ్మకు అస్సలు ఒంట్లో బాగాలేదు మందులు కొనడానికి వెళుతున్నాను” అని తెగ కంగారు పడుతున్నట్లుగా నటిస్తే పోలీసులు వదిలేసారని చెప్పుకొచ్చాడు.మరొకామె కారులో సీట్ బెల్ట్ ధరించకుండా వెళుతుంటే పోలీసులు ఆపారు దానికి ఆమె “నేను గర్భవతిని అందుకే సీట్ బెల్ట్ ధరించలేను’’అని అబద్ధం చెప్పానని చెప్పుకొచ్చారు.

మరో వ్యక్తి అయితే తన స్నేహితుడు కాస్త ఘాటు అయిన సాకు చెప్పాడని “సార్..నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె తన ప్రేమికుడితో సరసాలు ఆడుతోంది” అని చెప్పాడని పేర్కొన్నాడు. ఇలాంటి పిచ్చి, కొంటె సమాధానాలకు ఢిల్లీ పోలీసులు తెగ నవ్వుకున్నారట.మరికొంతమంది యూజర్లు ఢిల్లీ పోలీసుల ప్రవర్తనపై కూడా ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు ఎటువంటి కారణాలు లేకుండానే జరిమానాలు విధించారని ఫిర్యాదు చేశారు. కాగా నెటిజన్లు చెప్పిన సాకులన్నీ బాగా నవ్వు పుట్టించేలా ఉన్నాయి.

 

The post Traffic Rules : ట్రాఫిక్ రూల్స్‘బ్రేక్’ చేయటానికి కారణాలు ఇవట..! తెలిసింది కదా..పోలీసు బాబూలు ఇక చూస్కోండీ.. appeared first on 10TV.