TS High Court Recruitment 2022: తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుండాలి..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫకేషన్‌ ప్రకారం జడ్జి, రిజిస్ట్రార్‌లకు పర్సనల్‌ సెక్రటరీలు, కోర్టు మాస్టర్‌ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ‌ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది..

TS High Court Recruitment 2022: తెలంగాణ హైకోర్టులో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుండాలి..
Ts High Court Jobs

Telangana High Court Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫకేషన్‌ ప్రకారం జడ్జి, రిజిస్ట్రార్‌లకు పర్సనల్‌ సెక్రటరీలు, కోర్టు మాస్టర్‌ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ‌ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆర్ట్స్/సైన్స్‌/కామర్స్/లా స్పెషలైజేషన్లలో డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీతోపాటు షార్ట్‌హ్యాండ్‌, టైప్‌రైటింగ్‌ల్లో అర్హత సాధించి ఉండాలి. అలాగు జులై 1 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. వికలాంగ అభ్యర్ధులకు 10 యేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ పద్ధతిలో ‘The Registrar (Recruitment), High Court for the State of Telangana, Hyderabad-500026’ అడ్రస్‌కు పోస్టు ద్వారా జులై 22 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించాలి. ఓసీ, బీసీ అభ్యర్ధులకు రూ.800, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.400లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాలి. పాక్షిక దృష్టి, వినికిడి లోపం ఉన్నవారికి రిజర్వేషన్‌లు కేటాయించారు. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇతర పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ https://studycafe.in/tag/telangana-high-court/లో చెక్‌ చేసుకోవచ్చు.

కేటగిరీల వారీగా ఎన్ని పోస్టులున్నాయంటే..

  • ఓసీ కేటగిరీ పోస్టులు: 29
  • ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ పోస్టులు: 2
  • స్పోర్ట్స్‌ కోటా పోస్టులు: 1
  • వికలాంగులకు పోస్టులు: 3
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పోస్టులు: 17
  • ఎస్సీ పోస్టులు: 9
  • ఎస్టీ పోస్టులు: 4

అధికారిక నోటిఫకేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.