TS Inter Supply Exams 2022: నేటితో ముగియనున్న తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తుది గడువు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు నేటితో (జులై 8, శుక్రవారం) ముగియనుంది. గడువు సమయం ముగిసేలోపు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు..

TS Inter Supply Exams 2022: నేటితో ముగియనున్న తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు తుది గడువు
Ts Supply Exams

Telangana Inter Supplementary Exams 2022: తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు నేటితో (జులై 8, శుక్రవారం) ముగియనుంది. గడువు సమయం ముగిసేలోపు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఫీజును చెల్లించవల్సిందిగా బోర్డు సూచించింది. కాగా గత నెల 28న ఇంటర్‌ ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10 వరకు నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ ఫస్టియర్‌ విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్‌ విద్యార్ధులకు మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి 5 గంటల 30 నిముషాల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఇక ప్రాక్టికల్స్‌లో ఫెయిలైన విద్యార్ధులకు జులై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను త్వరలో విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెల్పింది.

ఇంటర్మీడియట్‌ రీ-వాల్యుయేషన్‌ కోసం 21,120 మంది, రీ-కౌంటింగ్‌కు 4,787 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులకు బుధవారంతో గడువు ముగిసింది. వీటితోపాటు, ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు ఆగస్టు నెలాఖరు నాటికి ప్రకటించనున్నారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.