TS Rains : తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు, అవసరమైతే తప్ప బయటకు రావొద్దు- సీఎం కేసీఆర్

TS Rains : తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కలెక్టర్లతో సహా సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సూచించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.  #NirmalFloods #Bhainsa

TS Rains : తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు, అవసరమైతే తప్ప బయటకు రావొద్దు- సీఎం కేసీఆర్

TS Rains : తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కలెక్టర్లతో సహా సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని సూచించారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.