Twitter Feature: కలిసి ట్వీట్ చేద్దాం రా.. ట్విట్టర్‌లో కొత్త ఫీచర్

ట్విట్టర్ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఒకేసారి ఒకే ఆలోచనను ఇద్దరూ కలిసి చెప్పే ఫీచర్ అది. ఈ ఫీచర్‌తో ఒకే ట్వీట్‌ను ఇద్దరు యూజర్లు ట్వీట్ చేయొచ్చు. మరి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో.. అందుబాటులోకి ఎప్పటి నుంచి రానుందనేది తెలుసుకుందాం. The post Twitter Feature: కలిసి ట్వీట్ చేద్దాం రా.. ట్విట్టర్‌లో కొత్త ఫీచర్ appeared first on 10TV.

Twitter Feature: కలిసి ట్వీట్ చేద్దాం రా.. ట్విట్టర్‌లో కొత్త ఫీచర్

Twitter

Twitter Feature: ట్విట్టర్ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ఒకేసారి ఒకే ఆలోచనను ఇద్దరూ కలిసి చెప్పే ఫీచర్ అది. ఈ ఫీచర్‌తో ఒకే ట్వీట్‌ను ఇద్దరు యూజర్లు ట్వీట్ చేయొచ్చు. మరి ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో.. అందుబాటులోకి ఎప్పటి నుంచి రానుందనేది తెలుసుకుందాం.

కో-ట్వీట్ అంటే ఏంటి?
ట్వీట్‌లు టైమ్ లైన్‌లో కనిపిస్తాయి. అలానే దానిని ఫాలోవర్స్ ఎవరైనా రీ-ట్వీట్ చేస్తే ఇతరులకు కనిపిస్తాయి. కొత్తగా వస్తున్న కో-ట్వీట్ ఫీచర్‌తో ట్వీట్ చేసే వ్యక్తితో పాటు, అదే ట్వీట్‌కు కో-ఆథర్‌గా వ్యవహరించిన యూజర్ టైమ్ లైన్‌పై కూడా ఆ ట్వీట్ కనిపిస్తుంది. అలా ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే ట్వీట్‌ను పోస్టు చేయొచ్చన్నమాట.

ఎలా చేయాలంటే..
ఈ ఫీచర్లో ముందుగా ట్వీట్ చేసే వ్యక్తి టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత కో-ట్వీటింగ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి ఎవరినైతే కో-ఆథర్ గా ఎంచుకుంటున్నారో వారికి డైరెక్ట్ మెసేజ్ చేస్తే ఇన్విటేషన్ వెళుతుంది. కో-ఆథర్ దాన్ని కన్ఫామ్ చేస్తే ట్వీట్ ఇద్దరి టైమ్ లైన్ పై కనిపిస్తుంది. కాకపోతే కో-ఆథర్ తప్పనిసరిగా ట్వీట్ చేసే వ్యక్తిని ఫాలో అవుతుండాలి. ఒకేసారి ఒక వ్యక్తితో కలిసి మాత్రమే ఇలాంటి ట్వీట్ చేయగలరు.

Read Also: కేంద్రంపై కర్ణాటక హై కోర్టుకు ట్విట్టర్.. కేంద్రంతో ముదిరిన వార్

కండిషన్స్
కో-ట్వీట్లకు సాధారణ ట్వీట్ల మాదిరే రీట్వీట్, కోట్వీట్, కామెంట్ ఆప్షన్లు ఉంటాయి. వీటిని ట్వీట్ చేసిన వ్యక్తి మాత్రమే పిన్‌టాప్ చేయగలరు. కో-ఆథర్‌కు ఈ అవకాశం ఉండదు. ఒకవేళ మీరు కో-ఆథర్ గా వ్యవహరించకూడదనుకంటే మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేయకుండా అకౌంట్ సెట్టింగ్స్ లో కో-ట్వీటింగ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేసుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు తిరిగి ఎనేబుల్ చేసుకోవచ్చు.

అలానే ఈ ఫీచర్ వీడియో, ఫొటోలతోపాటు ఇతరత్రా మీడియా పైల్స్ కు కూడా వర్తిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఈ ఫీచర్ ను ఎక్స్‌పరిమెంటల్‌గా అమెరికా, కెనడా, కొరియా దేశాల్లో పరీక్షిస్తున్నారు. త్వరలో ప్రపంచంలోని అన్ని రీజియన్లలో అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ట్విటర్ తెలిపింది.

The post Twitter Feature: కలిసి ట్వీట్ చేద్దాం రా.. ట్విట్టర్‌లో కొత్త ఫీచర్ appeared first on 10TV.