Uddhav Thackeray: ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే క్యాంపులో చేరిన థానె కార్పొరేటర్లు

థానె మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు షిండే క్యాంపులో చేరిపోయారు. థానె మున్సిపాలిటీకి చెందిన 66 మంది తిరుగుబాటు కార్పొరేటర్లు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి షిండేను కలిశారు. The post Uddhav Thackeray: ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే క్యాంపులో చేరిన థానె కార్పొరేటర్లు appeared first on 10TV.

Uddhav Thackeray: ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే క్యాంపులో చేరిన థానె కార్పొరేటర్లు

Uddhav Thackeray

Uddhav Thackeray: ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. థానె మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు షిండే క్యాంపులో చేరిపోయారు. థానె మున్సిపాలిటీకి చెందిన 66 మంది తిరుగుబాటు కార్పొరేటర్లు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి షిండేను కలిశారు. తాము షిండే ఆధ్వర్యంలో పనిచేయబోతున్నట్లు తెలిపారు. శివసేనకు ఇక్కడ మొత్తం 67 మంది కార్పొరేటర్లు ఉండగా, ఒక్కరు మినహా అందరూ షిండే క్యాంపులోనే చేరిపోయారు. దీంతో ఈ అంశంలో కూడా ఉద్ధవ్ పట్టు కోల్పోయినట్లైంది.

EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత మహారాష్ట్రలో అత్యంత కీలకమైన మున్సిపాలిటీ థానె. మరోవైపు శివసేనకు చెందిన ఎంపీలు కూడా షిండే క్యాంపులోకి చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శివసేనకు చెందిన ఒక ఎంపీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు శివసేన మద్దతు తెలపాలని కోరాడు. నిజానికి యూపీఏతో కలిసి ఉన్న శివసేన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతోంది. కానీ, తాజా పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకవేళ ఎంపీలు కూడా షిండే వైపు వెళ్తే శివసేన పార్టీపై ఉద్ధవ్ థాక్రే పూర్తిగా పట్టు కోల్పోయినట్లే.

The post Uddhav Thackeray: ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే క్యాంపులో చేరిన థానె కార్పొరేటర్లు appeared first on 10TV.