Viral Video: పాడుతా తీయగా చల్లగా అంటోన్న చిన్నారి బాలుడు.. నెటిజన్లు బాలుడి గాత్రానికి ఫిదా..
ఓ చిన్నారి అద్భుతంగా కీ బోర్డు ప్లే చేస్తున్నాడు. అంతేనా తన మధుమైన గాత్రంతో పాట కూడా పాడుతున్నాడు. ఆ కుర్రాడు పాట పాడుతున్నప్పుడు ఇచ్చే ఇక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే...
Viral Video: శిశుర్వేత్తి.. పశుర్వేత్తి..వేత్తి గానరసం ఫణి..అన్నారు పెద్దలు. సంగీతానికి అమ్మ కడుపులోని శిశువు కూడా పరవసిస్తుందట.. సృష్టిలోని ప్రతి జీవి సంగీతాన్ని ఆస్వాదిస్తాయట. అంతటి మహిమ ఉన్న సంగీటం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొంతమంది పాడుతుంటే చాలు ఏ పని చేస్తున్నా మానేసి మరీ.. సంగీతం వింటూ ఆ పాటను వింటూ ఆస్వాదిస్తుంటాం. నేటి జనరేషన్ లో కొంతమంది పిల్లలు పుడుతూనే ట్యాలెంట్‌ను తమతో పాటు భూమి మీదకు తెచ్చుకుంటున్నారా అనిపిస్తోంది. చిన్న వయసులోనే ఎన్నో ప్రత్యేకతలు చాటుతున్నారు. ఇదిగో ఇక్కడ ఓ చిన్నారి అద్భుతంగా కీ బోర్డు ప్లే చేస్తున్నాడు. అంతేనా తన మధుమైన గాత్రంతో పాట కూడా పాడుతున్నాడు. ఆ కుర్రాడు పాట పాడుతున్నప్పుడు ఇచ్చే ఇక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే…
ఆ బాలుడు చిన్నప్పుడు స్కూల్లో పాడిన ‘గులాబీ ఆంఖే’ పాట అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లవాడు కాస్త పెద్దవాడయ్యాడు. ప్రోగా పాడడం మొదలెట్టాడు. చక్కగా కీబోర్డు వాయించడం నేర్చుకున్నాడు. ఇప్పుడు కీ బోర్డు వాయిస్తూ ‘మేరే మెహబూబ్ ఖాయమత్ హోగీ’ అంటూ ప్రముఖ సింగర్ కిశోర్‌కుమార్‌లా పాడాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేసారు. ‘మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే’ చిత్రంలోని హిట్‌సాంగ్‌ను ఎంతో హృద్యంగా పాడుతూ అద్భుతంగా కీబోర్డును ప్లే చేస్తున్నాడు ఆ బాలుడు. ఈ వీడియోకు అవనీశ్ శరణ్ ‘మేడ్ మై డే’ అని క్యాప్షన్ ఇచ్చారు. చిన్నప్పుటికీ ఇప్పటికీ అతడి పాటలో మెచ్యూరిటీ కనిపించిందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. “లవ్లీ సాంగ్ అండ్ లవ్లీ సింగర్” అని ఒక యూజర్ రాశారు.
Made My Day. pic.twitter.com/SMKj5ZfyHO
— Awanish Sharan (@AwanishSharan) July 8, 2022
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..